E-Paper
Advertisement

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా
Advertisement

OTT Movie : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే చెవి కోసుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు చూస్తున్నంత సేపు ఈగోను సాటిస్ఫై చేసే అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పైగా ఇది ఒక రివేంజ్ డ్రామా కావడంతో సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అందరూ హీరో, విలన్ మధ్య జరిగే రివేంజ్ ఫైట్ కోసమే ఎదురు చూస్తారు. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి? అనే వివరాల్లోకి వెళితే…

స్టోరీ ఏంటంటే…

Advertisement

ఓపెన్ చేస్తే ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం జరుగుతున్నట్టుగా చూపిస్తారు. ఆ మార్కెట్లోని కౌంటర్ లో ఉన్న డబ్బునంతా ఆ దొంగలు దోచుకుంటారు. కానీ వాళ్లు అనుకున్నంత డబ్బు అక్కడ లేకపోవడంతో కౌంటర్ దగ్గర నిలబడి ఓనర్ తో ఎక్స్ట్రా డబ్బు కావాలని గొడవ పడతారు. ఇంత రచ్చ జరుగుతుంటే హీరోయిన్ వీళ్ళ మధ్యకు వచ్చి తనకు కావాల్సిన వస్తువు గురించి అడుగుతుంది. అంతకు ముందే ఆమె ఆ వస్తువుకు సంబంధించి డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ ఇప్పుడు దొంగలు క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బును అంతా దోచుకోవడంతో ఆమెకు తిరిగి రావాల్సిన అమౌంట్ ఓనర్ నుంచి రాదు. ఆ అమ్మాయి తనకు రావాల్సిన డబ్బును దొంగలు దగ్గర వసూలు చేసే ప్రయత్నం మొదలు పెడుతుంది. దీంతో అక్కడ ఫైట్ జరుగుతుంది.

ఆ తర్వాత ఒక డాన్స్ ప్రోగ్రాం ఉండగా అక్కడ ఓ అమ్మాయి డాన్స్ చేస్తూ కిందపడి కాలుని విరగ్గొట్టుకుంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ కి ఫోన్ చేసి తనకు గాయమైందని చెప్తుంది. ఫ్రెండ్ కోసం ఆ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతున్న వేదిక దగ్గరికి వెళ్లి హీరోయిన్ చూస్తే అక్కడ ఆమె కనిపించదు. కానీ ప్లీజ్ గెట్ మీ రివేంజ్ ఫర్ మీ అనే ఒక లెటర్ మాత్రం కనిపిస్తుంది. ఇదంతా ఏంటో అర్థం కాక తన ఫ్రెండ్ కోసం వెతికితే హీరోయిన్ కి వాష్ రూమ్ లో ఆమె సూసైడ్ చేసుకొని కనిపించి షాక్ ఇస్తుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న గత స్నేహాన్ని కళ్ళ ముందుకు తీసుకొస్తారు మేకర్స్. ఈ బాల్య స్నేహితులు ఇద్దరూ చదువుల కోసం దూరమవుతారు. చాలా కాలం తర్వాత కలిసి హ్యాపీగా ఉన్నాం అనుకునే లోపే ఆమె సూసైడ్ చేసుకుంటుంది. అసలు హీరోయిన్ ఫ్రెండ్ ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఎవరిపై తన ఫ్రెండ్ పగ తీర్చుకోవాలని ఆ లెటర్ రాసింది.? హీరోయిన్ తన ఫ్రెండ్స్ చావుకు కారణమైన వాళ్లను ఎలా కనుక్కుంది? అనే ప్రశ్నలకు జవాబు కావాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బల్లెరినా అనే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమా మొత్తం తన ఫ్రెండ్ కోసం హీరోయిన్ చేసే ఫైట్ చుట్టూ నడుస్తుంది. ఇక ఈ సినిమాను చూస్తే ఈజీగా మర్చిపోలేరు.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×