BigTV English

Lover Murder: ప్రియుడి కోసం లాడ్జికి వెళ్లిన యువతి.. పోలీసుల ఎదురుగానే హత్య!

Lover Murder: ప్రియుడి కోసం లాడ్జికి వెళ్లిన యువతి.. పోలీసుల ఎదురుగానే హత్య!

Lover Murder| క్షణికావేశంలో యువత తీసుకునే తప్పుడు నిర్ణయాలతో జీవితాలే నాశనమవుతుంటాయి. సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించకుండా కొందరు ప్రాణాంతకమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటిదే ఒక ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది. అక్కడ ఒక యువకుడు తన ప్రియురాలిని దొంగచాటుగా కలుసుకునేందుకు ఒక లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నాడు. అతని ప్రియురాలు అక్కడికి వచ్చిన కాసేపు తరువాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారి గది బయటఉండగానే లోపల హత్య జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నితేశ్ మినేకర్ (26) అనే యువకుడు ఈశ్వరి ఘూమ్నె (25) అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ఇంట్లో వారి తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. పైగా ఈశ్వరికి మరొక యువకుడితో వివాహం నిశ్చయించారు. దీంతో నితేశ్, ఈశ్వరి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!


ఈ క్రమంలో అక్టోబర్ 11, శుక్రవారం నితేశ్ ముందుగా పుణెకు వెళ్లిపోయి అక్కడ పింప్రి చించ్వాడ ఖరాల్ వాడీ ప్రాంతంలోని హోటల్ రాజ్ ప్లాజాలో రూమ్ బుక్ చేసుకున్నాడు. నితేశ్ రూమ్ లో ఉండగా మధ్యాహ్నం హోటల్ కు ఈశ్వరి కూడా చేరుకుంది. ఈశ్వరి రూమ్ లో చేరిన కాసేపు తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారిద్దరూ గట్టిగా మాట్లాడుకోవడం.. లాడ్జి సిబ్బంది బయటి నుంచి విన్నారు. కాసేపు తరువాత ఈశ్వరి కేకలు వేస్తున్నట్లు వినిపించింది. దీంతో లాడ్జి సిబ్బంది వెంటనే గది తలుపులు తట్టారు. కానీ ఎవరూ తలుపులు తీయలేదు.

లాడ్జి మేనేజర్ ఏదో జరుగుతోందని అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే లాడ్జికి చేరుకొని నితేశ్ ఉన్న గది తలుపులు తట్టారు. పోలీసులు వచ్చారు గది తలుపులు తెరవాలని చెప్పారు. దీంతో లోపలి నుంచి నితేశ్ సమాధానమిచ్చాడు. తాను బట్టలు వేసుకోలేదు. వస్తున్నాను అని చెప్పాడు. ఒక నిమిషం తరువాత నితేశ్ డోర్ తీసి.. తాను తన భార్య బట్టలు వేసుకోలేదు. రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని చెప్పి మళ్లీ గది లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు.

ఆ తరువాత పోలీసులు ఎంత సేపు ఎదురు చూసినా నితేశ్ తిరిగి రాలేదు. డోర్ తీయలేదు. చాలా ఎదురుచూసిన తరువాత పోలీసులు డోర్ పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లి చూడగానే షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. నితేశ్ తన ప్రియురాలిని కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఈశ్వరి శవం రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉంది. మరోవైపు నితేశ్ రూమ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. గదిలో నితేశ్ చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడు. అందులో తాను ఎందుకు ఈశ్వరిని హత్య చేయాల్సి వచ్చిందో వివరించాడు. తనను ప్రేమించిన ఈశ్వరి, తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానే మరొకరిని పెళ్లి చేసుకునేందకు సిద్ధపడిందని.. తాను మాత్రం ఈశ్వరిని మరొకరి భార్యగా ఊహించుకోలేక ఆమెను హత్య చేసినట్లు రాశాడు. ఈశ్వరి లేని లోకంలో తాను ఉండలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ లో రాసి మరణించాడు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×