E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలో మూవీ చూసిన జనాలు హీరోకి టికెట్ డబ్బులు పంపిన ఒకే ఒక్క మూవీ ఇదే

OTT Movie : ఓటీటీలో మూవీ చూసిన జనాలు హీరోకి టికెట్ డబ్బులు పంపిన ఒకే ఒక్క మూవీ ఇదే
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కదు. కానీ ఓటీటీలోకి వచ్చాక ఓ మంచి సినిమాను థియేటర్లలో చూడడం మిస్ అయ్యామే అని ఫీల్ అవుతుంటారు ఆడియన్స్. అయితే ఏకంగా అలా థియేటర్లలో మిస్ అయిన సినిమాను ఓటీటీలో చూసి… మూవీ నచ్చడంతో జనాలు టికెట్ డబ్బులను హీరోకి పంపిన సినిమాలు, సంఘటనలు ఉన్నట్టు ఇప్పటిదాకా మనం వినకపోయి ఉండవచ్చు. కానీ మన తెలుగు హీరో సినిమాకే ఇలాంటి విశేషం చోటు చేసుకుంది. ఆ సినిమా మరేంటో కాదు ‘లెవెన్’.

నవీన్ చంద్ర సినిమా ఘనత

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల లిస్ట్ లో ప్రముఖ నటుడు నవీన్ చంద్ర కూడా ఒకరు. స్టార్ డంతో పని లేకుండా కంటెంట్ ఉంటే చాలు అంటూ వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. సుదీప్ కిచ్చా దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘మార్క్’తో ఆయన ప్రేక్షకులను మరికొన్ని రోజుల్లోనే అలరించబోతున్నారు. ఈ చిత్రం 2025 క్రిస్మస్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర ‘మార్క్’ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన క్రైమ్ థ్రిల్లర్ ‘లెవెన్’ (Eleven)కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని ఆయన వెల్లడించారు.

Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ప్రీమియర్ అయ్యాక ‘లెవెన్’ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని నవీన్ చంద్ర పేర్కొన్నాడు. కొందరు తనకు టికెట్ డబ్బులు కూడా పంపారని, థియేటర్లలో ఈ ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను చూడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారని వెల్లడించాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లలో కాకపోతే ఓటీటీలో ఆదరణ దక్కుతుందని మరోసారి ఈ ఘటనతో ప్రూవ్ అయ్యింది. కాగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ‘లెవెన్’ తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కింది. ఈ చిత్రంలో రేయా హరి కథానాయికగా నటించగా, అభిరామి, రవివర్మ, దిలీపన్, రిత్విక, శశాంక్, ఆడుకలం నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఒకవేళ ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Read Also : ఐదు ఆస్కార్‌లను గెలుచుకున్న ‘అనోరా’ నుంచి ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ వరకు… ఒక్కోటి ఒక్కో జెమ్… ఇందులో మీరెన్ని చూశారు?

కథలోకి వెళ్తే…

Advertisement

విశాఖ‌ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌ అరవింద్ (న‌వీన్‌ చంద్ర‌). స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆయన దగ్గరకు ఓ ఇంట్రెస్టింగ్ కేసు వస్తుంది. న‌గరంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న వ‌రుస హ‌త్య‌ల కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ రంజిత్ (శ‌శాంక్‌)కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్య‌తను అర‌వింద్ తీసుకుంటాడు. ఈ కేసు సాల్వ్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందంటే… హంతకుడిని పట్టుకోవడం అటుంచితే, కనీసం హత్యకు గురైన వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకవు పోలీసులకు. మరి ఈ హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? వాడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడు? అన్నది స్టోరీ.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×