E-Paper
Advertisement

Year Ender 2025 : ఐదు ఆస్కార్‌లను గెలుచుకున్న ‘అనోరా’ నుంచి ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ వరకు… ఒక్కోటి ఒక్కో జెమ్… ఇందులో మీరెన్ని చూశారు?

Year Ender 2025 : ఐదు ఆస్కార్‌లను గెలుచుకున్న ‘అనోరా’ నుంచి ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ వరకు… ఒక్కోటి ఒక్కో జెమ్… ఇందులో మీరెన్ని చూశారు?
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం సినిమాల వైవిధ్యంతో ప్రేక్షకులను ఆకర్షించింది. సూపర్ హీరోల సినిమా నుంచి హర్రర్ థ్రిల్స్, అదిరిపోయే యాక్షన్ సినిమాలను కూడా అందించింది. అయితే ఈ ఏడాది ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఎగ్జైట్ చేశాయి అనే ఆసక్తికర విషయాన్ని గూగుల్ సర్చ్ ట్రెండ్స్ వెల్లడించాయి. ఆసక్తికరంగా హాలీవుడ్ సినిమాలు ఈ గ్లోబల్ ట్రెండ్ లో టాప్ 10 జాబితాలో ఆధిపత్యం చెలాయించాయి. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు జాబితాలో చోటు దక్కించుకోకపోయినా, అనేక చిత్రాలు ఊహించిన దానికంటే ఎక్కువ బజ్‌ను సృష్టించాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సర్చ్ చేసిన టాప్ 10 హాలీవుడ్ చిత్రాలను ఇప్పుడు పరిశీలిద్దాం .

అనోరా (Anora) – JioHotstar

ఏడాది పొడవునా ఇంటర్నెట్‌ను ఆకర్షించింది ఈ మూవీ. ఐదు ఆస్కార్‌లను గెలుచుకున్న ఈ చిత్రం అవార్డుల సీజన్‌లో అతిపెద్ద విజేతగా, గూగుల్‌లో నెంబర్ వన్ మోస్ట్ సర్చ్డ్ చిత్రంగా కూడా నిలిచింది.

సూపర్ మ్యాన్ (Superman) – JioHotstar

Advertisement

జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన కొత్త ‘సూపర్‌మ్యాన్’ చిత్రం సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కొత్త తారాగణం, తాజా కథ, బలమైన బాక్సాఫీస్ విజయం దీనిని గూగుల్‌లో మోస్ట్ సర్చ్డ్ లిస్ట్ లో రెండవ స్థానానికి చేర్చాయి.

మైన్‌క్రాఫ్ట్ సినిమా (Minecraft Movie) – Prime Video

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో గేమ్ ఆధారిత చిత్రం ఇది. ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ జానర్లో నిర్మించిన సినిమాలలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఇది కూడా ఒకటి.

థండర్‌బోల్ట్స్ (Thunderbolts) – JioHotstar

Advertisement

మార్వెల్స్ ‘థండర్‌బోల్ట్స్’ యాంటీహీరోలపై కొత్త దృక్పథాన్ని పరిచయం చేసింది. స్టార్-స్టడెడ్ తారాగణం, మల్టీవర్స్ కనెక్షన్‌లతో మార్వెల్ ఫ్యాన్స్ కు ఈ మూవీ ఐ ఫీస్ట్ గా మారింది. ఫలితంగా దీనికి మోస్ట్ సర్చ్డ్ సినిమాల్లో స్థానం దక్కింది.

సిన్నర్స్ (Sinners) – Amazon Prime video

ఆ సంవత్సరంలో థ్రిల్లర్ అభిమానులలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ‘సిన్నర్స్’ ఒకటి.ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ఏడాది పొడవునా ట్రెండ్ అవుతూనే ఉంది.

హ్యాపీ గిల్మోర్ 2 (Happy Gilmore 2) – Netflix

ఈ జాబితాలో ఉన్న సినిమాలలో OTT ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదలైన ఏకైక చిత్రం ‘హ్యాపీ గిల్మోర్ 2’. 90ల నాటి ప్రసిద్ధ చిత్రం హ్యాపీ గిల్మోర్‌కి సీక్వెల్ అయిన ఈ చిత్రం నోస్టాల్జియా కారణంగా గూగుల్ సర్చ్ లో అగ్రస్థానానికి చేరుకుంది.

ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (Final Destination: Bloodlines) – JioHotstar

ఫైనల్ డెస్టినేషన్ భయంకరమైన ఫ్రాంచైజీలో వచ్చిన తాజా భాగం ‘బ్లడ్‌లైన్స్’. ఇందులోని ఒక్కో సీన్ వణుకు పుట్టిస్తుంది. ఈ లిస్ట్ లో ఇంకా వెపన్స్, 28 ఇయర్స్ లేటర్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్

మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్ (Mission: Impossible – The Final Reckoning ) – Prime video

టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్’ సిరీస్‌లోని చివరి అధ్యాయం కథ, అద్భుతమైన విన్యాసాలు, భావోద్వేగాలు, క్లైమాక్స్ దీనికి గూగుల్ మోస్ట్ సర్చ్డ్ లో అగ్రస్థానం సంపాదించిపెట్టాయి.

Read Also : ప్రియురాలి ఉచ్చులో ప్రియుడు బలి… మర్డర్ కేసులో అడ్డంగా బుక్… ఓటిటిలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×