BigTV English
Advertisement

OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉన్నా మరో అమ్మాయితో… వీడి కక్కుర్తికి మూల్యం ఏంటో తెలిస్తే దిమాక్ కరాబ్

OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉన్నా మరో అమ్మాయితో… వీడి కక్కుర్తికి మూల్యం ఏంటో తెలిస్తే దిమాక్ కరాబ్

OTT Movie : మలయాళం ఇండస్ట్రీ చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా రేంజ్ సినిమాలను తీసేవరకు  వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మలయాళం సినిమాల హవా కనబడుతోంది. మంచి కంటెంట్ తో తెరకె  క్కిస్తున్నారు దర్శకులు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ (Hotstar)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు “హృదయం“(Hridayam). చదువుకోవడానికి కాలేజ్ కి వెళ్లిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్ లో తనకి ఎదురయ్యే అనుభవాలతో కథ ముందుకు వెళుతుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు చదువుకున్న రోజుల్లో మనల్ని మనం ఊహించుకుంటాం. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అరుణ్ అనే కుర్రాడు ఇంజనీరింగ్ చదవడానికి సిటీలో ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ర్యాగింగ్ జరుగుతుండగా దర్శన అనే ఒక అమ్మాయి పాట పాడుతూ కనిపిస్తుంది. మొదటిచూపులోనే ఆ అమ్మాయిని అరుణ్ ఇష్టపడతాడు. ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆమె పాడుతున్న పాటలకి మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంటాడు. అయితే అదే కాలేజ్ లో సీనియర్ అయిన బైజు కూడా దర్శన ను లవ్ చేస్తాడు. ఆమె అరుణ్ తో క్లోజ్ గా ఉండటంతో అతన్ని కొడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసి దర్శన బైజు వాళ్ళ గ్యాంగ్ ముందే అరుణ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఒకరోజు అరుణ్ దర్శన ను బీచ్ కి తీసుకెళ్లి ఐ లవ్ యు చెప్తాడు. తను కూడా ఐ లవ్ యు చెప్తుంది. ఇలా ఉంటే తన ఫ్రెండ్ తో కలసి ఒకసారి పార్క్ కి వెళ్తాడు అరుణ్. అక్కడ ఒక అందమైన అమ్మాయి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. ఆమెతో అరుణ్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్తాడు. అప్పుడే అక్కడ రాజకీయ గొడవలు జరుగుతుండగా, అక్కడ అరుణ్ ఆమెతో ఉన్న వీడియో బయటకి వస్తుంది.

అది చూసిన హీరోయిన్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని ఎందుకు చెప్పావు అని అతని మీద కోప్పడి వెళ్ళిపోతుంది. అప్పటినుంచి వీళ్ళిద్దరూ కాస్త దూరంగా ఉంటారు. హీరో మొదట తాగుడుకు బానిసవగా, కొద్దిరోజుల తర్వాత కోలుకొని, అతని క్లాస్మేట్ ద్వారా మంచిగా చదివి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో వీళ్లకు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతుండగా. నీకు అప్పుడే నేను సారీ చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా అని దర్శనతో చెప్తాడు అరుణ్. చివరికి వీళ్ళిద్దరూ మళ్లీ ప్రేమించుకుంటారా? తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధానికి అరుణ్ ఓకే అంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న “హృదయం” (Hridayam) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

Related News

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

Big Stories

×