4B Movement In USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం పట్ల ఆదేశ మహిళలు కొత్త ఉద్యమానికి తెరలేపారు. కమలా హారిస్ గెలవాలని భావించినా, ట్రంప్ విన్ కావడంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ గెలుపునకు పురుషులే కారణం అంటూ, వారి మీద కక్ష తీర్చునేందుకు రెడీ అయ్యారు. 4B ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
అబార్షన్ చట్టంపై అమెరికా మహిళల ఆందోళన
తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో అబార్షన్ చట్టం అనేది కీలక పాత్ర పోషించింది. ఈ చట్టం కారణంగా అమెరికాలో మహిళలు చట్టబంధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోయారు. సుమారు 50 ఏండ్ల క్రితం అబార్షన్ ను చట్టబద్ధం చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని రీసెంట్ గా ఆదేశ సుప్రీం కోర్డు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అబార్షన్ ను కఠినతరం చేశాయి. అక్కడి మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో కమలా హారీస్ ఈ విషయంపై స్పందించారు. మహిళల హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో చాలా మంది మహిళలు కమలా హారిస్ విజయం సాధించాలని కోరుకున్నారు. ఆమెకు తమ మద్దతు తెలిపారు. అయితే, ఈ ఎన్నికల్లో కమలా ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. పురుషులు అంతా కలిసి ట్రంప్ ను గెలిపించారని మహిళలు ఓ రేంజ్ లో కోపంగా ఉన్నారు. ఆ కోపంలో 4B ఉద్యమానికి తెరలేపారు. తమ హక్కులను కాపాడే ప్రయత్నం చేయని పురుషులతో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు.
This is NOT a drill.
Millions of liberal women are going on sex strikes for the next 4 years… 🤣🤣 pic.twitter.com/kgDmPaW4tq
— American AF 🇺🇸 (@iAnonPatriot) November 6, 2024
ఇంతకీ 4B ఉద్యమం అంటే ఏంటి?
అమెరికా మహిళలు 4B ఉద్యమానికి తెరలేపడంతో.. ఇంతకీ ఈ ఉద్యమం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమం దక్షిణ కొరియాలో తొలిసారి మొదలయ్యింది. B అంటే కొరియన్ భాషలో నో అనే అర్థం ఉంది. తమ హక్కులను పట్టించుకోని పురుషులతో వేగలేక అక్కడి మహిళలు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో భాగంగా మహిళలు పురుషులతో శృంగారం, రిలేషన్ షిప్స్, పెళ్లి, పిల్లల్ని కనడం లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పురుషులను అన్ని రకాలుగా దూరం పెడతారు. ప్రస్తుతం అమెరికాలో ఈ ఉద్యమం ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ ఉద్యమాన్ని మరికొంత మంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఉద్యమం కాదని, జస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త ఉద్యమం అమెరికా సమాజం మీది ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని అక్కడి విశ్లేషకుల ఆరా తీస్తున్నారు.
Tons of liberal women are joining the s*x strike.
“Baby, if you wanted to touch my body, you should’ve voted for it.” pic.twitter.com/muoiJTXFHD
— Dean Cramer | Kingsofar (@kingsofar) November 8, 2024
Read Also: షిప్ లో జర్నీ చేస్తూ చనిపోతే.. డెడ్ బాడీని ఏం చేస్తారో తెలుసా?