hyderabad: హైదరాబాద్‌లో పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని ఓ ఇంటి గోడ కూలింది. దీంతో రాళ్లు ఎగిరిపడడంతో పక్కనే బస్తీలో ఉన్న బాలికకు గాయాలు అయ్యాయి.
అయితే, పేలుడికి సంబంధించి కారణాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలేం జరిగింది? అనేదానిపై ఆరా తీస్తున్నారు.
జూబ్లిహిల్స్‌లోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ ఉంది. అందులో కంప్రెసర్ పేలినట్టు తెలుస్తోంది. దీని ధాటికి ప్రహారీ గోడ డ్యామేజ్ అయ్యింది. వెంటనే బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
రాళ్లు ఎగిరి 100 మీటర్లు దూరంలో ఉన్న బస్తీలోని ఇళ్లపై పడ్డాయి. నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఘటనపై స్థానిక పోలీసులు హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. మీడియాను ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. దీనిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ ఘటనపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు
తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో పేలిన ఫ్రిజ్ కంప్రెసర్
ఈ ఘటనలో ప్రహరీ గోడ ధ్వంసం
రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని బాలికకు స్వల్ప గాయాలు
భారీ శబ్దానికి భయభ్రాంతులకు గురైన స్థానికులు #JubileeHills #TelanganaSpiceKitchenRestaurant… pic.twitter.com/DBXpaN35Kn
— BIG TV Breaking News (@bigtvtelugu) November 10, 2024