BigTV English
Advertisement

OTT Movie : ఈ అందమైన అమ్మాయిలు చేసేపని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది… ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : ఈ అందమైన అమ్మాయిలు చేసేపని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది… ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాల హడావిడి నడుస్తోంది. ఈ సినిమాలను మంచి కంటెంట్ తో తెరమీద ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మలయాళం ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. 2023 లో వచ్చిన ఒక పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు “కొల్లా” (Kolla). ఈ మూవీలో ఇద్దరమ్మాయిలు బ్యాంకు రాబరీ చేయడానికి ఒక ఊరికి వస్తారు. వీళ్ళు చేసే ఆ రాబరీ చుట్టు మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

అనీ, శిల్ప కొత్తగా ఒక ఊరికి వచ్చి బ్యూటీ పార్లర్ ని నడపాలని చూస్తారు. అయితే అందులో మరమ్మత్తుల కోసం ఒక కాంట్రాక్టర్ ని పరిచయం చేసుకుంటారు. అతనితోపాటు ఆ ఊరిలో అందరితో మంచిగా పరిచయం పెంచుకుంటారు. ఒకరోజు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి అందరికీ ఇన్విటేషన్లు ఇస్తారు. ఆ తర్వాత స్టీఫెన్ అనే వ్యక్తిని అక్కడికి పిలిపిస్తారు. ఈ అమ్మాయిలు  బ్యాంకు రాబరీ చేయడానికి బ్యూటీ పార్లర్ పేరుతో ఆ ఊరికి వచ్చి ఉంటారు. బ్యూటీ పార్లర్ పై అంతస్తులోనే బ్యాంకు ఉండటంతో పక్క ప్లాన్ తో స్కెచ్ వేసి, స్టీఫెన్ తో కలిసి రాబరికి ప్లాన్ చేస్తారు. స్టీఫెన్ రావడంతో ఆరోజు రాత్రి బ్యాంకులో మొత్తం సొమ్మును తీసుకెళ్లి ఒకచోట భద్రంగా దాచిపెడతారు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు అమాయకంగా నటిస్తూ ఉంటారు. ఈ రాబరి ఎలా జరిగిందో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. పోలీసులు ఎంత వెతికినా ఒక్క క్లూ కూడా  దొరకదు. ఈ అమ్మాయిలను విచారించినప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్లామని చెప్తారు.

ఒకరోజు సీసీటీవీ ఫుటేజ్ ని ఇన్స్పెక్టర్ చెక్ చేస్తున్నప్పుడు అందులో స్టీఫెన్ కనిపిస్తాడు. అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ స్టీఫెన్ ని పోలీస్ స్టేషన్ కి పిలుస్తాడు. అయితే హార్ట్ ఎటాక్ రావడంతో స్టీఫెన్ అక్కడే చనిపోతాడు. అయితే ఈ దొంగతనం ఇక్కడితోనే క్లోజ్ కాకూడదని, స్టీఫెన్తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ కొన్ని దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి తెస్తాడు. చివరికి ఇన్స్పెక్టర్ వెలుగులకి తెచ్చిన ఆ విషయాలు ఏమిటి? బ్యాంకు సొమ్మును ఈ అమ్మాయిలు పంచుకుంటారా? పోలీసులు ఈ అమ్మాయిలను అరెస్ట్ చేస్తారా? ఆ డబ్బు తీసుకొని అమ్మాయిలు పారిపోతారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “కొల్లా” (Kolla) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

Big Stories

×