Meenakshi Chaudhary: ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఏడాది ఒకేసారి నాలుగు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకోవడంతో పాపకు డిమాండ్ పెరిగింది. ఇక సినిమా ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి. దాంతో ఈ అమ్మడు షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఓ వార్త షికారు చేస్తుండు. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చెయ్యను అని దర్శక నిర్మా తలకు షాక్ ఇచ్చింది. అసలు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి చూసేద్దాం..
దుల్కర్ సల్మాన్‌తో కలిసి మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. గత వారం ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీలో తాను పోషించిన పాత్రపై మీనాక్షి చౌదరిలో కొత్త భయం మొదలైందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నటి స్వయంగా చెప్పింది. ఈ మూవీలో సాధారణ మధ్యతరగతి వ్యక్తికి భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా మీనాక్షి చౌదరి కనిపించింది. తన నటనతో మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌ని మెప్పించినప్పటికీ.. మీనాక్షి చౌదరి ఆ డీగ్లామర్ పాత్ర గురించి భయపడుతోందట. దాంతో ఇకపై తల్లి, మిడిల్ క్లాస్ భార్య పాత్రల్లో నటించకూడదని ఫిక్స్ అయ్యిందట. అలాంటి పాత్రల్లో నటిస్తే గ్లామర్ పాత్రల్లో చెయ్యడానికి ఆఫర్స్ దూరం అవుతున్నాయి అని భావిస్తుంది.
ఈ అమ్మడు లక్కీ భాస్కర్‌లో అన్నింటికీ సర్దుకుపోయే మధ్య తరగతి గృహిణిగా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఒక్కసారి అలాంటి పాత్ర చేస్తే.. ఇండస్ట్రీలో ఆ పాత్రలకే పరిమితం చేస్తారని మీనాక్షి చౌదరని ఆమె స్నేహితులు, సన్నిహితులు భయపెడతున్నారట. అందుకే ఇకముందు అలాంటి పాత్రలు చెయ్యబోనని తెగేసి చెప్పేసింది. ఇక ముందు గ్లామర్ డోస్ పెంచే పాత్రలు ఉన్న సినిమాలే చేస్తానని చెప్పేసింది. అక్టోబరు 31న విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తర్వాత వరుణ్‌తేజ్‌తో మీనాక్షి చౌదరి నటించిన మట్కా నెగిటివ్ టాక్ ను అందుకుంది. నిన్న వచ్చిన మెకానిక్ రాకీ కూడా బోల్తా కొట్టింది. ఇక సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతి కి వస్తున్నాం సినిమాతో రాబోతుంది. అది ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..