E-Paper
Advertisement

OTT Movie : డబ్బున్నోడిగా బిల్డప్ ఇస్తూ వేశ్య కూతురిపై కన్ను… క్లైమాక్స్ చూస్తే దిమాక్ కరాబ్

OTT Movie : డబ్బున్నోడిగా బిల్డప్ ఇస్తూ వేశ్య కూతురిపై కన్ను… క్లైమాక్స్ చూస్తే దిమాక్ కరాబ్
Advertisement

OTT Movie : ఓటిటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా రొమాంటిక్, క్రైమ్, కామెడీ, హర్రర్ సినిమాలు రిలీజ్ అయితే వీకెండ్ వాటిని చూడకుండా వదిలిపెట్టరు ఓటిటి మూవీ లవర్స్. అయితే జానర్ ఏదైనా కంటెంట్ బాగుండే సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా అలాంటిదే. టైటిల్ బో*ల్డ్ గా ఉన్నప్పటికీ స్టోరీ మాత్రం ప్యూర్ గా ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జీ 5లో అందుబాటులో…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. మలయాళ సినిమాలకు ఇప్పుడు ఓటిటిలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చూసాక మంచి ఫీల్ గుడ్ మూవీని చూసామే అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే సాగుతుంది. అలాగని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మూవీ ఏ కాలం నాటిదో మాత్రం కాదు. రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఓపెన్ చేస్తే హీరో అనారోగ్యంతో ఉన్న తన ఫ్రెండ్ తో కలిసి పడవలో ప్రయాణిస్తూ కనిపిస్తాడు. అతను తన చెల్లి, తల్లి మంచిది కాదు అంటూ మాట్లాడుతూనే ఉంటాడు. చివరికి చెడుగా చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడు. అయితే అతని శవానికి అంత్యక్రియలు జరిపించడానికి బాడీని తీసుకుని హీరో ఫ్రెండ్ ఊరికి వెళ్తాడు. మొత్తానికి అంత్యక్రియలు పూర్తవుతాయి. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ కు సంబంధించిన బాక్స్ ఒకటి ఉందని వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి వెళ్తాడు. దీంతో అతని ఫ్రెండ్ తల్లి చనిపోయేటప్పుడు కూడా నన్ను నన్ను అసహ్యించుకున్నాడా అని అడిగి బాధపడుతూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోకి వాళ్ళ పట్ల అసహ్యం ఉండడంతో చెప్పేది వినకుండా వెళ్ళిపోతాడు. ఇక తన ఫ్రెండ్ చెల్లినైతే కనీసం కన్నెత్తి చూడడు. హీరోయిన్ ఒకానొక టైం లో తను చేసిన తప్పేంటి? అని ప్రశ్నిస్తూ బాధపడుతుంది. దీంతో హీరో కళ్ళు తెరుచుకుని అప్పటి నుంచి ఆమెను ఎలా చూసాడో పక్కన పెట్టేసి కొత్త కోణంలో ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పటికే ఊరికి వెళ్ళిపోదాం అనుకున్న హీరో ఆమెపై మనసు పడి అక్కడే ఉండాలని అనుకుంటాడు. కానీ ఆమె తల్లి వేశ్య కావడంతో ఊరంతా వాళ్ళిద్దరి గురించి చెడుగా మాట్లాడతారు. కానీ హీరో ఇవన్నీ పట్టించుకోడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఇల్లు, డబ్బు సంపాదించాలని హీరోయిన్ కి చెప్పి ఓ రిస్కీ పని చేయడానికి వెళ్తాడు. ఇదే టైంలో ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిపోయిన విలన్ ఊర్లోకి అడుగు పెడతాడు. చూడడానికి రిచ్ గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు. అడగని వాళ్ళకి అడిగిన వాళ్ళకి డబ్బులు పంచుకుంటూ, హీరోయిన్ పై కన్నేస్తాడు. అవును పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు కానీ హీరోయిన్ మనసు మొత్తం హీరో పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. దానిని మనసులో పెట్టుకున్న ఆ విలన్ హీరో లేని టైం చూసి హీరోయిన్ ను రేప్ చేస్తాడు. మరి విషయం తెలుసుకున్న హీరో ఏం చేస్తాడు? ఆ తర్వాత హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మనోరతంగల్’ అనే సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ను చూడాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×