E-Paper
Advertisement

ETV Win OTT : అచ్చ తెలుగు ఓటీటీ ఈటీవి విన్ లో అక్టోబర్ లో రాబోతున్న సినిమాల లిస్ట్

ETV Win OTT : అచ్చ తెలుగు ఓటీటీ ఈటీవి విన్ లో అక్టోబర్ లో రాబోతున్న సినిమాల లిస్ట్
Advertisement

ETV Win OTT : ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి దిగ్గజ ఓటీటీల హవా నడుస్తోంది. అయితే వీటిలో అన్ని భాషల సినిమాలు అందుబాటులో ఉంటాయి. కానీ ప్యూర్ తెలుగు కంటెంట్ మాత్రం ఉండదు. తెలుగు మూవీ లవర్స్ కోసం అలా ప్యూర్ తెలుగు కంటెంట్ ఉండే ఓటీటీలు అనగానే ఆహా, ఈటీవీ విన్ గుర్తొస్తాయి. ఇందులో ఈటీవీ విన్ ఇటీవల కాలంలో కాస్త జోరు పెంచింది. ఇక కొత్త మంత్ వచ్చేసింది కదా… మరి ఇందులో ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

అక్టోబర్ సినిమాల లిస్ట్ 

Advertisement

ఈటీవీ విన్ లో ఈ మంత్ పండగలు, హాలిడేస్ సందర్భంగా సరికొత్త సినిమాలు ,వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తాజాగా ఇందులో2 తెలుగు సినిమాలతో పాటు ఒక కొరియన్ డబ్బింగ్ వెబ్ సిరీస్ ను కూడా ఈనెల రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రతి నెలా ఈటీవీ విన్ మొదటి రోజునే తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలను ప్రకటిస్తుంది. అలా ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన లిస్టును కూడా రిలీజ్ చేసింది. అందులో ఈనెల ఏఏ సినిమాలు, సిరీస్ లు ఈటీవీ విన్లో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయాలను వెల్లడించారు. అక్టోబర్ 3 న రాజ్ తరుణ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘భలే ఉన్నాడే’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఇదివరకే ఈటీవీ విన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అక్టోబర్ 10న ‘తత్వ’ అనే తెలుగు మూవీ ఈటీవీ విన్ లోకి అడుగు పెట్టబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ‘కలి’ అనే మూవీ డిజిటల్ రైట్స్ ను కూడా ఈటీవీ విన్ చేజిక్కించుకుంది. నరేష్ అగస్త్య, ప్రిన్స్ కలిసి నటించిన ఈ సస్పెన్ థ్రిల్లర్ మూవీని అక్టోబర్ నెలలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఈటీవీ విన్ వెల్లడించింది.

కొరియన్ సినిమా కూడా…

Advertisement

ఇక ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు 2017లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ కొరియన్ వెబ్ సిరీస్ ను కూడా ఈటీవీలో స్ట్రిమింగ్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘హిడెన్ ఐడెంటిటీ’. దీన్ని అక్టోబర్ 31 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈనెల ఈటీవీ విన్ లో మూడు తెలుగు సినిమాలను, ఒక సిరీస్ ను చూడడానికి రెడీ అయిపోండి. ఇక ఇదే ఓటిటీ ప్లాట్ ఫామ్ లో థియేటర్లలో బహిట్ టాక్ తెచ్చుకున్న కమిటీ కుర్రోళ్ళు, సోపతులు, సురాపానం, నింద, ఆర్టిఐ లాంటి తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ‘వెల్కమ్ టు లైఫ్’ అనే కొరియన్ వెబ్ సిరీస్ కూడా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×