E-Paper
Advertisement

OTT Movie : 1,150 కోట్ల కలెక్షన్స్… ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమా… డిసెంబర్ 31 తరువాత ఓటీటీలో డిలీట్

OTT Movie : 1,150 కోట్ల కలెక్షన్స్… ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమా… డిసెంబర్ 31 తరువాత ఓటీటీలో డిలీట్
Advertisement

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే సినిమాలు ఓటీటీలో అడుగు పెడతాయన్న విషయం తెలిసిందే. కానీ అలా అడుగు పెట్టిన సినిమాలకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందన్న విషయం తెలుసా? సినిమాల గడువు డీల్ ముగిశాక లేదా రిలీజ్ అయ్యి చాలాకాలం అయ్యాక ఓటీటీలు వాటిని డిలీట్ చేస్తాయి. అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ హర్రర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఓ మూవీ మరికొన్ని రోజుల్లో ఓటీటీ నుంచి డిలీట్ కాబోతోంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

వాస్తవ కథ ఆధారంగా రూపొందింన హర్రర్ చిత్రం “ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్” (The Exorcism of Emily Rose) త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుండి డిలీట్ కాబోతోంది. భయంకరమైన సంఘటనలు, ఉత్కంఠభరితమైన సాహసాలతో ఉండే ఈ మూవీ 23 ఏళ్ల అమ్మాయి కథ. హర్రర్ మూవీ అభిమానులు తప్పక చూడవలసిన మూవీ. ఒకవేళ ఇంకా చూడకపోతే డిసెంబర్ 31కి ముందే ఒక లుక్కేయండి. కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇలాంటి పాత సినిమాలకు వీడ్కోలు పలుకుతోంది నెట్ ఫ్లిక్స్ (Netflix).

Advertisement

150–160 కోట్ల (సుమారు 1.15 బిలియన్ డాలర్లు) బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,150 కోట్లు (సుమారు 1.15 బిలియన్ డాలర్లు ) వసూలు చేసింది. IMDbలో 6.7 రేటింగ్‌ను సంపాదించుకున్న ఈ మూవీ సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ హర్రర్ చిత్రంగా అవార్డును పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కానీ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ మూవీని చూసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత, దీనిని ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా తొలగిస్తారు.

Read Also : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే

కథలోకి వెళ్తే…

Advertisement

2005లో రిలీజైన సూపర్ హిట్ హాలీవుడ్ హర్రర్ చిత్రం “ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్”. ఈ సినిమా దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది. ఎమిలీ రోజ్ అనే 23 ఏళ్ల అమ్మాయి జీవితంలో అకస్మాత్తుగా ఊహించని మార్పులు సంభవిస్తాయి. వింత స్వరాలు వినడం మొదలు పెడుతుంది. వివరించలేని గాయాలు అవుతాయి. క్రమంగా ఆమె ప్రవర్తన మారుతుంది. లూసిఫర్, బెలియల్, నీరో, కెయిన్, జూడాస్, లెజియన్ అనే ఆరుగురు భయంకరమైన రాక్షసులు ఆమెను పట్టి పీడిస్తున్నారు అనే భయంకరమైన నిజం వెలుగులోకి వస్తుంది. దీంతో ఎమిలీ భూతవైద్యం చేయించుకుంటుంది, కానీ కొంతకాలం తర్వాత ఆమె చనిపోతుంది. ఈ సంఘటన ఈ సినిమాలో అతిపెద్ద మలుపు. ఎమిలీని నిజంగా దుష్టశక్తులు పట్టి పీడించాయా? లేదా ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుందా? ఎమిలీకి చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు, మరి ఆమె మందులు ఎందుకు తీసుకోలేదు? ఆమె చావుకు కారణం ఏంటి? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×