BigTV English

OTT Movie : భార్యతో ఫ్రెండ్ యవ్వారం… అసలు విషయం తెలియక సాయం చేసే భర్త

OTT Movie : భార్యతో ఫ్రెండ్ యవ్వారం… అసలు విషయం తెలియక సాయం చేసే భర్త

OTT Movie : లవ్ స్టోరీ లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్ల సినిమాలు అందుబాటులో ఉంటాయి. ఇక ముఖ్యంగా అందులో ఆసక్తిని పెంచే సినిమాలు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు. ఇలాంటి వాటిని బిగ్ స్క్రీన్ పై పెద్దగా చూడకపోయినప్పటికీ ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి ఒక రిఫ్రెష్ సింగ్ రామ్ కామ్ మూవీనే. మరి ఈ వింత లవ్ స్టోరీనీ ఎక్కడ చూడొచ్చు? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


జియో సినిమాలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ గురించి. నిజానికి ఇదొక తమిళ సినిమా. కొన్నాళ్ల క్రితం ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. లాజిక్స్ వెతుక్కోకుండా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ని చూడాలి అనుకునే వారికి ఈ మూవీ మంచి సజెషన్. సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడవగా, మూడు క్యారెక్టర్లను కూడా డైరెక్టర్ బ్యాలెన్సింగ్ గా నడుపుతూ స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు “పొన్ ఒండ్రు కండేన్” (Pon Ondru Kanden). ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే…

శివ ఒక గైనకాలజిస్ట్. మరోవైపు స్టార్ హోటల్ లో చెఫ్ గా పని చేస్తుంది శాండీ. ఆమె అసలు పేరు సుందరి. ఈ అమ్మడికి ఫారిన్ లోని స్టార్ హోటల్ లో చెఫ్ గా అవకాశం వస్తుంది కానీ అది వర్కౌట్ కాకపోవడంతో చెన్నైలోని హోటల్లో చీఫ్ చెఫ్ గా వర్క్ చేస్తుంది. ఇక వీళ్ళిద్దరికీ ఓ రోజు రెస్టారెంట్లో పరిచయం అవుతుంది. ఇక ఆ తర్వాత సీన్లో శివ, సాయి స్కూల్ ఫ్రెండ్స్. ఇద్దరికీ ఫ్రెండ్స్ నుంచి స్కూల్ రీయూనియన్ అంటూ కాల్ వస్తుంది. చిన్నప్పటి నుంచి శివ, సాయి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఒక అమ్మాయి వల్ల వీరిద్దరూ శత్రువులుగా మారి చాలా ఏళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్ లో మళ్ళీ కలుసుకుంటారు. అయితే ఆ టైంలో సాయి తల్లికి హెల్త్ బాగా లేకపోవడంతో శివ వెళ్లి సహాయం చేస్తాడు. దీంతో ఎప్పటిలాగే ఇద్దరూ మళ్లీ ఫ్రెండ్స్ అవుతారు. అలాగే ఆమెకు మంచి వైద్యం కోసం చెన్నైకు తీసుకు రమ్మని చెప్తాడు. సాయి కూడా అదే చేస్తాడు.

కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సాయి ఉండే అపార్ట్మెంట్ లోనే శాండీ కూడా ఉంటుంది. ఇక సాయి, శాండిపై మనసు పడతాడు. శివ చెప్పే ఐడియాలను ఫాలో అవుతూ ఆమెకు దగ్గరవడం వంటివి చేస్తాడు. సాయి తో పాటు ఆమె తల్లితో కూడా శాండీ కూడా బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఓ రోజు సాయి తను ఇష్టపడ్డ అమ్మాయిని శివకు పరిచయం చేయాలని కలుద్దాం రమ్మంటాడు. కానీ ఆమెను చూడగానే శివ పారిపోతాడు. అసలు శివ హీరోయిన్ చూసి ఎందుకు పారిపోయాడు? హీరోయిన్ కి అసలు విషయం తెలిసిందా? ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ చివరికి ఎలా మేనేజ్ చేశారు? సాయి, శాండీల పెళ్లి జరిగిందా లేదా? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×