BigTV English

Vijay Deverakonda : జారి కిందపడ్డ విజయ్.. ట్రోలర్స్ కు గూబ గుయ్యిమనేలా స్ట్రాంగ్ కౌంటర్..

Vijay Deverakonda : జారి కిందపడ్డ విజయ్.. ట్రోలర్స్ కు గూబ గుయ్యిమనేలా స్ట్రాంగ్ కౌంటర్..

Vijay Deverakonda : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. గతంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేదు. దాంతో ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తక్కువ టైంలోని అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరో అయ్యాడు. కానీ వెంట వెంటనే ఫ్లాప్స్ రావడం, అతని యాటిట్యూడ్, యారగెంట్ గా మాట్లాడటంతో అనేక సార్లు వివాదాలు కూడా తెచ్చుకున్నాడు. ఇక తాజాగా విజయ్ కిందపడ్డ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన విజయ్ ఇంస్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది..


ఇకపోతే ఇటీవల విజయ్ ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తూ మెట్ల మీద నుంచి దిగుతుంటే స్లిప్ అయి జారి పడ్డాడు. అది పెద్ద సేన్సేషనల్ అయ్యింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇక ట్రోలర్స్ రెచ్చిపోయి విజయ్ దేవరకొండ పడ్డాడు, విజయ్ పడిపోయాడు, చూసి నడవమని.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసారు. ఆ ట్రోల్స్ కాస్త విజయ్ చెవిన పడ్డాయి. దీనిపై తాజాగా విజయ్ రెస్పాండ్ అయ్యాడు. ఒక్కొక్కరికి గట్టిగానే పెట్టాడు.

విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. అంతేకాదు ఓ వీడియో షేర్ చేసాడు. తనకు రౌడీ అనే క్లాత్ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. మెట్ల మీద పడ్డ వీడియోకి కింద స్టైల్ గా పడుతున్నది జతచేసి ఒక వీడియో ఎడిట్ చేసాడు. ఆ వీడియోపై నేను పడుతూనే ఉంటాను ప్రేమలో నా రౌడీ బాయ్స్, గర్ల్స్ తో. రౌడీ వేర్ తో కూడా అందరూ ప్రేమలో పడతారు అంటూ ఒక యాడ్ వీడియోలా తయారు చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన రౌడీ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ట్రోలర్స్ కు ఒకవైపు కౌంటర్ ఇస్తూనే మరోవైపు నీకు తగినట్లు మార్చుకున్నావు. నీ తెలివికి ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.. ఈ దెబ్బతో అందరు నోర్లు మూస్తారని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ వీడియో మరోసారి వైరల్ అయ్యింది.


ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. ఆ మూవీ పార్ట్ 2 లో కూడా నటించనున్నాడు. మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈసారి ఎవరు ఊహించని విధంగా మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు యాడ్స్ చేస్తున్నాడు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×