E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీని షేక్ చేస్తున్న 50 ఏళ్ల నాటి సినిమా… టాప్ 10 లో ట్రెండింగ్

OTT Movie : ఓటీటీని షేక్ చేస్తున్న 50 ఏళ్ల నాటి సినిమా… టాప్ 10 లో ట్రెండింగ్
Advertisement

OTT Movie : కల్ట్ క్లాసిక్ సినిమాలకు ఎప్పటికైనా ఆదరణ తగ్గదు అని ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఓ ఓల్డ్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. టాప్ 10లో ట్రెండింగ్ లో నిలిచిన ఆ సినిమా మరోసారి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనేలా చేసింది. మరి ఇప్పటికీ ప్రేక్షకులను అంతగా ఉత్సాహపరుస్తున్న ఆ 50 ఏళ్ల నాటి సినిమా ఏంటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ చిత్రంలోని ప్రతి డైలాగ్, పాత్ర, పాట, కథ అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. Gen Z కూడా ఈ సినిమా విషయంలో క్రేజీగా ఉన్నారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్న కల్ట్ క్లాసిక్ ‘షోలే’ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో టాప్ 10లో మూడవ స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం.

Advertisement

షోలే సినిమాను ఇటీవలే థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సినిమా 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, దాని అసలు క్లైమాక్స్, అన్‌కట్ వెర్షన్‌తో తిరిగి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, జయ భాదురి, అమ్జద్ ఖాన్, సంజీవ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఒకవేళ థియేటర్లలో కాకుండా ఈ మూవీని ఇంట్లోనే చూడాలనుకుంటే మూవీ హాట్ స్టార్ లో ఉంది.

ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలు అయింది. ఇది 1975లో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుండి భారీ ఆదరణను అందుకుంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమాకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

Advertisement

Read Also : ‘రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్’ కంటే ముందు చూడాల్సిన రాధిక ఆప్టే మూవీస్

కథలోకి వెళ్తే

రామ్‌ఘర్ అనే గ్రామాన్ని పట్టిపీడిస్తున్న క్రూరమైన దొంగ గబ్బర్ సింగ్ (అంజాద్ ఖాన్). అతన్ని పట్టుకోవడానికి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ బల్దేవ్ సింగ్ (సంజీవ్ కుమార్) ఇద్దరు చిన్న దొంగలు జై (అమితాబ్ బచ్చన్), వీరు (ధర్మేంద్ర)లను నియమించుకుంటాడు. ఇందులో వీరు-జైల మధ్య స్నేహం, బసంతి (హేమ మాలిని)తో వీరు, రాధ (జయా బచ్చన్)తో జై ప్రేమ కథతో మూవీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి గబ్బర్ సింగ్ ను పట్టుకున్నారా లేదా ? ఎవరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అన్నది ఈ మూవీ స్టోరీ. ఒకవేళ ఇంకా ఈ కల్ట్ క్లాసిక్ ను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×