E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మాన్యుయేల్ షాకింగ్ ఎలిమినేషన్… ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్

Bigg Boss 9 Telugu : ఇమ్మాన్యుయేల్ షాకింగ్ ఎలిమినేషన్… ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సీజన్ పేరు చెప్పగానే ఇమ్మూ చేసిన కామెడీ, అతని మమ్మా సంజన చేసిన దొంగతనాలు, టాస్క్ లలో డెమోన్ విధ్వంసం, కామ్ అండ్ కంపోజ్డ్ కామన్ మ్యాన్ కళ్యాణ్, శివంగి తనూజ గుర్తొస్తారు. అయితే ఈ టాప్ 5లో ఉన్నవారంతా విన్నర్ కావడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఈ వారం రోజుల ఓటింగ్ తో విన్నర్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. ఫలితంగా టాప్ కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ ఇద్దరూ అవుట్ 

సమాచారం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఇమ్మాన్యుయేల్, సంజన ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. దీంతో హౌస్ లో డెమోన్, కళ్యాణ్, తనూజ టాప్ 3గా ఉన్నారు. సీజన్ 9 మొదటి నుంచి ఎటు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఇటు టాస్క్ ల పరంగా ప్రాణం పెట్టి ఆడాడు ఇమ్మూ. ఎవ్వరినీ నొప్పించకుండా తాను నొచ్చుకోకుండా… బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 10 వారాలు నామినేషన్ లోకి రాని కంటెస్టెంట్ గా చరిత్రను లిఖించాడు. అలాగే 3 సార్లు కెప్టెన్ అయ్యి ప్రభంజనం సృష్టించాడు. మమ్మా చేసిన తప్పులకు తాను తలవంచుకున్నాడు. ఇంత చేసినా ఈ సీజన్లో కూడా కమెడియన్ కు కప్పు కొట్టే ఛాన్స్ దక్కకపోవడం బాధాకరం. టాప్ 5 కంటెస్టెంట్స్ లో నుంచి ముందుగా సంజన ఎలిమినేట్ అయ్యింది. ఆమెను టాప్ 5గా బయటకు సాగనంపారు. ఇక నెక్స్ట్ ఇమ్మూని టాప్ 4గా ఎలిమినేట్ చేసి బైబై చెప్పారు.

గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మూ 

Advertisement

షోలో విన్నర్ ను తేల్చడానికంటే ముందు సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చి ఇలా కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఒకరిని ఎలిమినేట్ చేయడానికి రంగంలోకి దిగారు. ఆయన పంపిన రోబో టాప్ 4లో ఇమ్మూ దగ్గరే ఆగడంతో అతడినే నవీన్ పోలిశెట్టి బయటకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఊహించని షాక్ కు ఇమ్మూ గుక్కపెట్టి ఏడ్చినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఎలిమినేషన్ గురించి తెలుసుకున్న ఇమ్మూ  అభిమానులు ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్… కనీసం టాప్ 2లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇమ్మూ అంటూ బాధ పడుతున్నారు. కాగా ఇదంతా రేపటి ఎపిసోడ్ లో ప్రసారం కానుంది. కాగా టాప్ 3లో ఉన్న ముగ్గురూ చాలా తక్కువ ఓటింగ్ తేడాతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి విన్నర్ ఎవరో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ ను డోంట్ మిస్.

Read Also : తనూజను బెదరగొట్టిన శివాజీ… సీజన్ 10 ట్విస్ట్ తీసుకొచ్చిన శ్రీముఖి – ప్రదీప్… గాయపడ్డ కళ్యాణ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×