E-Paper
Advertisement

OTT Movie : కొడుకును మార్చడానికి ప్రియురాలితో ఆ పని చేసే తండ్రి… కొడుకు చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

OTT Movie : కొడుకును మార్చడానికి ప్రియురాలితో ఆ పని చేసే తండ్రి… కొడుకు చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Advertisement

OTT Movie : ఈరోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తున్నారు. వీటిలో నచ్చిన సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలుగుతున్నారు. వీటిలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలను ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. సరదాగా సాగిపోతూ యూత్ ని ఎంటర్టైన్ చేసే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఫ్లెక్స్

Advertisement

ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘సన్ ఆఫ్ ఏ రిచ్‘ (Son of a rich). ఈ మూవీలో హీరో ఏ పని పాట లేకుండా, ఫీలింగ్స్ అసలే లేకుండా తిరుగుతూ ఉంటాడు. కొడుకుని మామూలు మనిషిని చేయడానికి తండ్రి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఈ మూవీ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో బాగా డబ్బున్న కుటుంబంలో పెరిగి ఉంటాడు. ఇతడు అందరితో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. ఏ పని చేయకపోవడం, ఎవరిని లెక్క చేయకపోవడం చూసి తండ్రి విసిగిపోయి ఉంటాడు. ఒకసారి పోలీసులను తన కారుతో నిర్లక్ష్యంగా గుద్దుతాడు. పోలీసులు హీరో తండ్రికి, నీ కొడుకు ప్రవర్తన మారాలని అతనికి చెప్తారు. ఈ క్రమంలో హీరో తండ్రి తనకు తెలిసిన వాళ్ళతో ఒక ఉపాయం ఆలోచిస్తాడు. హీరోకి మత్తు ఇచ్చి సిటీకి దూరంగా ఉండే ఒక చోటికి తీసుకు వెళ్తారు. అక్కడ హీరో లేచి చూసేసరికి 18 సెంచరీ అట్మాస్ఫియర్ ఉండే ప్రాంతానికి వెళ్తాడు. గుర్రాలను క్లీన్ చేసే వ్యక్తిగా అతని గెటప్ మారిపోతుంది. అతడు టైం ట్రావెల్ చేసి వచ్చానేమో అనుకుంటాడు. ఇతనికి చెప్పిన పని చేయకపోయినప్పుడల్లా కొర్ర దెబ్బలు పడుతుంటాయి. అయినా ఇతనికి ఎదుటి వ్యక్తి పట్ల జాలి దయ ఏమి మారకుండా ఉంటాయి. కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు తండ్రి బాధపడుతూ ఉంటాడు.

ఒక రూమ్ లో సీసీ కెమెరాతో చెక్ చేస్తూ ఉంటారు. ఇదంతా అతడు మారడానికి తండ్రి చేస్తున్న ప్లాన్. అయితే అక్కడ ఒక అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి ముసలి వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, కావాలని చనిపోవడానికి వెళ్తుంది. హీరో ఏ ఫీలింగ్స్ లేకుండా కాసేపు అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత ఆమె చనిపోతుందేమో అని కాపాడుతాడు. అలా అతనికి ఫీలింగ్స్ మొదలవుతాయి. ఒకసారి మంగోలియన్లు ఆడపిల్లలను ఎత్తుకొని పోవడానికి వస్తారు. ఇది కూడా వీరి ప్లాన్ లో భాగం. అయితే ముందుగా అక్కడున్న ఒక అమ్మాయిని తీసుకుంటారు. ఆమె తండ్రి అడ్డుకోవడంతో అతనిని చంపేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ను తీసుకోవడానికి వెళ్తారు. హీరోయిన్ కాపాడమని హీరోని అడుగుతుంది. అతడు చివరికి హీరోయిన్ని కాపాడుతాడా? అతడు మళ్లీ సమాజంలో మనిషిగా మసులుకుంటాడా? హీరోయిన్ తో కొత్త జీవితం మొదలు పెడతాడా?అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఫ్లెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×