Pushpa2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. భారీ అంచాలతో విడుదలై రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. అల్లు అర్జున్, సుక్కు కాంబోలో గతంలో వచ్చిన పుష్ప రికార్డులను క్రాస్ చేసింది. ఒక్క ఏరియాలోనే కాదు. అన్ని ఏరియాలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పుష్ప 2 థియేటర్లలోకి వచ్చి పది రోజులు అయిన కూడా ఇంకా జోరు తగ్గలేదు. కల్కి రికార్డులను బ్రేక్ చేసే రేంజులో కలెక్షన్స్ రాబట్టింది. 1200 కోట్ల మార్క్ ను దాటేసింది. దాంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ తో కాస్త డౌన్ అయిన కలెక్షన్స్ నిన్న ఈరోజు అదే జోరు కనిపిస్తుంది. ఈ నెల వరకు ఇదే జోరు కొనసాగితే ఈజిగా 2000 కోట్లు రాబట్టడం పక్కా అవుతుంది..
పుష్ప మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి జనాలు నీరాజనం పలుకుతున్నారు. మాస్ యాక్షన్ సన్నివేశాలు, దేవీ శ్రీ మ్యూజిక్ జనాలను థియేటర్లలోకి రప్పించి. కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఇక తొమ్మిదో రోజు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయిన ఘటన కారణంగా అరెస్ట్ అయ్యాడు. మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చేసాడు. ఆయన అరెస్ట్ అవ్వడంతో ఇటు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు టెన్షన్ పడ్డారు. మొత్తానికి ఆయన రిలీజ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. హీరో అరెస్ట్ అవ్వడంతో అభిమానులు జైలు దగ్గరకు వచ్చారు. నిన్న అదే జోష్ లో మరో 70 కోట్లు రాబట్టిందని టాక్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు ఏ మూవీ కూడా వసూలు చేయలేదు. కేవలం పుష్ప సినిమా మాత్రమే ఇంత భారీగా వసూలు చేయడం అంటే మాటలు కాదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు రాబట్టలేదు.
పుష్ప రాజ్ దెబ్బకు గతంలో సాధించిన సూపర్ స్టార్స్ రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజు విశ్వరూపం చూపించిన పుష్ప .. రెండో రోజు కూడా అదే జోష్ తో కలెక్షన్లను అందుకున్నాడు.. 10 రోజుల్లోనే 1200 కోట్లకు పైగా వసూల్ చెయ్యడం మాములు విషయం కాదు.. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్పారాజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా భారీ హైప్ ను తీసుకురావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. 1200 థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప 2 ఇప్పుడు 1500 కోట్ల క్లబ్ లోకి పరుగులు పెట్టేస్తుంది..