Rewind 2024 : ఈ ఏడాది సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంది. రిలీజ్ అయిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకోవడం విశేషం. అయితే 2024 లో సినిమాలు విడుదల అవ్వడంతో పాటుగా ఎన్నో సంఘటనలు జరిగాయి. గుడ్ న్యూస్ లు ఎంతగా విన్నామో, శాడ్ న్యూస్ లు కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఎక్కువ మంది సెలెబ్రేటీలు చనిపోయారు కూడా. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఏడాది చనిపోయిన సెలెబ్రేటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
2024 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు కాలం చెల్లారు.. ‘దంగల్’ చిత్రంలో బబితా ఫోగట్ పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ 16 ఫిబ్రవరి 2024న కేవలం 19 ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డెర్మటోమయోసిటిస్ అనే వ్యాధితో బాధ పడింది. చివరకు ప్రాణాలు వదిలింది. అతి చిన్న వయస్సులోనే అరుదైన వ్యాధి కారణంగా ప్రాణాలను వదిలేసింది.
సినీ నటుడు రితురాజ్ సింగ్ తన 59వ ఏట 19 ఫిబ్రవరి 2024న ముంబైలో గుండెపోటుతో మరణించారు. ప్రముఖ ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ తన 72వ ఏట ఈ ఏడాది ఫిబ్రవరి 26న తుది శ్వాస విడిచారు. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ రషీద్ ఖాన్ ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కోల్‌కతాలో జనవరి 9న కన్నుమూశారు…
అదే విధంగా..శారదా సిన్హా’ 72 ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. అతని పాటలు లేకుండా ఛత్ పండుగ అసలు బాగోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.. నటుడు హిమేష్ రేష్మియా తండ్రి, ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా 18 సెప్టెంబర్ 2024న చనిపోయారు. అలాగే సినీ నటుడు అతుల్ పర్చురే 14 అక్టోబర్ 2024న ముంబైలో కన్నుమూశారు. వీరితో పాటుగా అమీన్ సయానీ, బినాకా గీతమాల”కి ప్రసిద్ధి చెందిన పురాణ రేడియో హోస్ట్, 91వ ఏట గుండెపోటుతో ఫిబ్రవరి 20న కన్నుమూశారు.. ఇంకా కొందరు సెలెబ్రేటీలు కన్ను ముశారు.. అదే విధంగా వికాస్ సేథీ, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ వంటి ప్రముఖ టీవీ షోలలో తన సహాయ పాత్రలకు గుర్తింపు పొందాడు, సెప్టెంబర్ 8న నాసిక్‌లో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.. అందరికన్నా కూడా దంగల్ నటి అతి చిన్న వయస్సులోనే చనిపోవడం భాదాకరం. ఇంకా కొందరు సెలెబ్రేటీలు కన్ను ముశారు.. వీరంతా సెలబ్రేటి హోదాలో ఉన్న వాళ్ళే కావడం విశేషం.. ఇక ఈ ఏడాదిలో వివాదాలు కూడా ఎక్కువనే చెప్పాలి. నిన్న మొన్నటివరకు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఆయన అరెస్ట్ అవ్వడం గంటల వ్యవధిలోనే విడుదల అవ్వడం జరిగింది. ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు అలాగే మోహన్ బాబు మీడియా ప్రతి నిధుల పై దాడి చెయ్యడం చర్చనీయంశంగా మారింది. అలాగే సెలెబ్రేటిలు పెళ్లి పీటలు ఎక్కారు..