E-Paper
Advertisement

OTT Movie : పిల్లల కోసం పేదింటి అమ్మాయిని టార్చర్ పెట్టే జమిందార్… ప్రియుడి ఎంట్రీతో స్టోరీలో ఊహించని ట్విస్ట్

OTT Movie : పిల్లల కోసం పేదింటి అమ్మాయిని టార్చర్ పెట్టే జమిందార్… ప్రియుడి ఎంట్రీతో స్టోరీలో ఊహించని ట్విస్ట్
Advertisement

OTT Movie : ఈరోజుల్లో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల వ్యవధిలోని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.  అటువంటి ఒక సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ  బో*ల్డ్ మూవీ పౌరాణిక కథతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ మూవీ ఒక ధనవంతుడు అయిన భర్త పిల్లల కోసం భార్యను ఇబ్బంది పెట్టడంతో భార్య ఏం  చేసిందనే కథ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు “ది లాస్ట్ వైఫ్” (The last wife). ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఒక రాజ్యంలో జమీందారీగా ఒక ధనవంతుడు ఉంటాడు. అతడు పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని తన ఇంటికి తెచ్చుకునే ముందే ఆమెకున్న పేదరికం భవిష్యత్తులో తనకు అంటకూడదని పూజలు చేసి, తరువాత తన ఇంటికి తీసుకువస్తాడు.  ఈమె ఈ రాజుకు మూడో భార్య. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె గర్భవతి అవుతుంది. దురదృష్టవశాత్తు ఆమె ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఈ విషయం తెలిసిన ఆ జమీందారు ఆగ్రహిస్తాడు. భార్యను చిత్రహింసలు పెడతాడు. ఎందుకంటే ఇంతకుముందున్న ఇద్దరు భార్యలకు పిల్లలు పుట్టరు. తనకి మగ బిడ్డ పుట్టాలని ఆమెను బట్టలు లేకుండా వివిధ ఆసనాలు వేయిస్తూ పూజలు చేయిస్తాడు. అయినా ఏడు సంవత్సరాలు దాటినా ఆమెకు పిల్లలు పుట్టరు. ఇది ఇలా ఉంటే మరోవైపు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆమె ఉంటున్న ఊరికి హీరో వచ్చి ఆమెతో మాట్లాడతాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా డబ్బు కోసం ఆ ధనవంతుడిని పెళ్లి చేసుకున్నావు. నీ జీవితం నువ్వు చూసుకున్నావు నన్ను మరిచిపోయావు కదా అని తన ఫీలింగ్ వ్యక్త పరుస్తాడు.

అందుకు ఆమె నేను ఆ ధనవంతుడిని చేసుకోవడానికి కారణం నా పేదరికమే. మా కుటుంబం చాలా కష్టాల్లో ఉన్నది. మమ్మల్ని పోషించడానికి ఒకసారి మా నాన్న దొంగతనం చేయాల్సి వచ్చింది. అతన్ని కాపాడే ప్రయత్నంలో నన్ను ఆ జమీందారు చూశాడు. నన్ను ఇష్టపడ్డాడు. మా నాన్నని కాపాడుకునే పరిస్థితుల్లో నేను ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంది. జమీందారు తనకి పెట్టే బాధలను కూడా తనతో పంచుకుంటుంది. ఈ విషయం గ్రహించిన హీరో ఆ జమిందార్ ని ఏం చేస్తాడు? జమిందార్ పెట్టే కష్టాల నుంచి ఈమె బయట పడుతుందా? చివరికి హీరో ఈమెను పెళ్లి చేసుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ది లాస్ట్ వైఫ్ (The last wife) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ లో బోల్డ్ కంటెంట్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.

 

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×