BigTV English

Trinayani Serial Today October 24th: ‘త్రినయని’ సీరియల్‌: అద్దంలో కనిపించిన చీర కట్టుకుంటానన్న  నయని – నయని మెడలో అమ్మవారి బిల్ల తీసేయాలన్న తిలొత్తమ్మ

Trinayani Serial Today October 24th: ‘త్రినయని’ సీరియల్‌: అద్దంలో కనిపించిన చీర కట్టుకుంటానన్న  నయని – నయని మెడలో అమ్మవారి బిల్ల తీసేయాలన్న తిలొత్తమ్మ

trinayani serial today Episode: హాసిని, తిలొత్తమ్మ గొడవ పడుతుంటారు. విశాల్‌ వాళ్లను అపుతాడు. నువ్వు చెప్పు నయని అంటాడు. నీ మెడలో ఉన్న అమ్మవారి బిల్ల నీకు కలలో కనిపించినప్పుడు లేదంటే అర్థం ఏంటి. అది పోగొట్టుకున్నాకే ప్రాణగండం వస్తుందనా..? అని అడుగుతాడు. అదే అర్థం కావడం లేదు బాబుగారు అంటుంది. నీకు అద్దంలో కనిపించిన చీర కూడా వేరే అన్నావు కదా చెల్లి అని అడుగుతుంది హాసిని. అవునని చెప్తుంది నయని. ఆ చీర ఇప్పుడు నీతో ఉందా? అక్కా అని అడుగుతుంది సుమన.


ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకుని వచ్చే ఆపదేంటో తెలుసుకోగలిగితే దాన్ని నివారించవచ్చు అనిపిస్తుంది. భయపడుతూ అనుమాన పడుతూ ఇబ్బంది పడటం కన్నా ధైర్యంగా ఆ ఆపదేంటో తెలుసుకుంటే దాన్ని అధిగమించవచ్చు బాబుగారు అంటుంది నయని. దీంతో విక్రాంత్‌ నిజమే అంటాడు. ఆ చీర కట్టుకుంటే తప్పా ఏం జరగుతుందో తెలియదు అంటుంది నయని. త్వరగా ఆ చీర కట్టుకుని నువ్వు కనబడాలి నయని అని చెప్తుంది తిలొత్తమ్మ.

గార్డెన్‌లోకి వెళ్లిన తిలొత్తమ్మను.. చెప్పు మమ్మీ అని అడుగుతాడు వల్లభ. గాయత్రిపాప తనకు మెడలో వేయమని దండ ఇచ్చినప్పుడే నయనికి గుర్తుకు వచ్చింది కలలో తన ఫోటోలో బిల్ల లేదని చెప్తుంది తిలొత్తమ్మ. అదేమన్నా బంగారమా.. వెండా.. మమ్మీ నల్లదారం రెండు రూపాయలు ఇస్తారు. ఇక బిల్ల అంటావా? ఓ ఐదు రూపాయలు వేసుకో అని వల్లభ అనగానే అరేయ్‌ కొన్నింటి విలువ చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ వాటిని అంటిపెట్టుకుని ఉన్న కథ కావొచ్చు. వాటి విలువ కావొచ్చు దాన్ని కొలువవచ్చు అని తిలొత్తమ్మ చెప్తుంది.


అమ్మవారే తిరిగి ఆ దండ కట్టినప్పుడు ఎలా పోతుంది అని వల్లభ అడుగుతాడు. పోదు కానీ మనం తెంచితే పోతుంది కదా? బాగా ఆలోచిస్తే నయనికి ఆ దండ లేకపోతేనే ప్రాణగండం వస్తుందేమో అనిపిస్తుంది అని తిలొత్తమ్మ చెప్పగానే మరి ఆ చీర కాన్సెఫ్ట్‌ ఏంటి అని వల్లభ అడగ్గానే దాని గురించి కూడా ఆలోచించాలి అంటుంది తిలొత్తమ్మ. పెద్దమరదలు చాలా తెలివైంది మమ్మీ అంటాడు వల్లభ కానీ మనం అతి తెలివి ఉపయోగించాలి అని తిలొత్తమ్మ చెప్పగానే నేను రెడీ మమ్మీ అంటాడు వల్లభ. దీంతో తాను చీర కట్టుకున్నప్పుడే నయని మెడలో బిల్ల తీసేలా చేయాలని చెప్తుంది తిలొత్తమ్మ.

విక్రాంత్‌ ఫోన్‌లో మాట్లాడుతుంటే సుమన వచ్చి ఎదురుగా నిల్చొని ఫోజులు కొడుతుంది. సుమనను తిడుతూ ఫోన్‌ లో వాళ్లకు మిమ్మల్ని కాదని చెప్తూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. నేను ఇంపార్టెంట్‌ కాల్ మాట్లాడుతుంటే అలా వంకర్లు పోతూ ఇబ్బంది పెడుతున్నావెందుకు అంటాడు వల్లభ. ఏం లేదని హాసిని, నయని అక్కలిద్దరూ షాపింగ్‌కు వెళ్తున్నారని.. నాక్కూడా రోజు కలలో పట్టుచీరలు నగలు బోలెడన్నీ కనిపిస్తున్నాయి. వాటిలో నేను ఒక్కటైనా కొనుక్కుంటాను డబ్బులిస్తారా? అని అడుగుతంది. నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావా?  నా ముందు చేయ్యే చాచను.. త్వరలో శ్రీమంతురాలిని అవుతానని బిల్డప్‌ ఇచ్చావు కదా? అంటాడు.

నిజం చెప్పు వదినకు ఏదైనా జరగరానిది జరిగితే బాగుండు అని మనసులో అనుకుంటున్నావా? అని విక్రాంత్‌ అడగ్గానే.. ఏం మాట్లాడుతున్నారండి మీరు తను ఎవరనుకున్నారు. నా తొడబుట్టింది. నాకన్నా ముందు పుట్టి నన్ను ఎత్తుకుని తిరిగింది కూడా ఇదిగోండి ఇంకోసారి ఇలా అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంది. నోర్మూయ్‌ నిజంగా మీ అక్క క్షేమం గురించి నువ్వు నిజంగా ఆలోచించి ఉంటే ఏ పూజనో వ్రతమో చేస్తానని మొక్కుకునే దానివి అంటాడు విక్రాంత్‌. దీంతో దీక్ష చేస్తే వచ్చే గండమేదైనా ఆగిపోతుందా? అని సుమన అడుగుతుంది. నువ్వు దీక్ష చేస్తానని చెప్పు తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తానని నాకు మాటివ్వు నువ్వు కోరుకున్న చీరలు, నగలు కొనిస్తానని విక్రాంత్‌ అడగ్గానే వద్దని సుమన వెళ్లిపోతుంది.

గార్డెన్‌ లో కూర్చున్న విశాల్‌ దగ్గరకు ఆయాసపడుతూ వెళ్తుంది హాసిని. ఏంటి వదిన ఏం జరిగింది అని అడుగుతాడు. మీ ఆవిడకు మ్యాచింగ్‌ చీర కొనేటప్పటికి తలలో ప్రాణం తొకలోకి వచ్చిందని రేపు ఉదయం నేను లేవలేదు అనుకో ఇక పైకి పోయాననుకో అంటుంది హాసిని. దీంతో ఎందుక అక్కా అలా మాట్లాడుతున్నావు. మనం కొన్న చీర బాబుగారికి చూపించాలని వచ్చాం అంటుంది నయని. ఇంతలో విశాల్‌ ఎందుకు అలాంటి చీరే కొనాలని అనుకున్నావని విశాల్‌ అడుగుతాడు. ఆ చీర ఎప్పుడు కట్టుకోవాలి..? ఎక్కడికి వెళ్లాలి అనేది తర్వాత చెప్తాను అంటుంది నయని. దీంతో నీలాంటి ఆడపిల్లను నేను ఎక్కడా చూడలేదు. నీకు విశాలాక్షి అమ్మవారు ఎంత ఓపిక ఇచ్చారు అంటుంది హాసిని. దీంతో నయని.. హాసినిని తీసుకుని లోపలికి వెళ్తుంది.

గాయత్రి దేవి వచ్చి తన ఫోటోను చూస్తుంటుంది. తిలొత్తమ్మ వచ్చి ఏంటక్కా అలా చూస్తున్నావు. నీ కొడలు కన్ను మూశాక నీ ఫోటో కన్నా పెద్ద ఫోటో పెట్టాలని చూస్తున్నావా? పెడతాములే ఫోటో పెట్టడమే కాదు.. రోజు కొత్త పూలదండ వేస్తాములే అంటుంది. ఇంతలో వల్లభ, హాసిని వస్తారు. ఎంటి మమ్మీ పెద్దమ్మ ఫోటో చూస్తూ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. పిచ్చి పట్టిందేమో అని హాసిని అంటుంది. నేను ఫోటో చూడటం లేదని గాయత్రి అక్కా నీ వెనకాలే ఉందని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో గాయత్రి దేవి వల్లభ గొంతు పట్టుకుంటుంది. వల్లభ గిలగిల కొట్టుకుంటాడు. విశాల్‌, నయని వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ అమ్మ నా కొడుకుని చంపేస్తుంది విశాల్ అని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×