OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. అందులో నూ హాలీవుడ్ సినిమాలు యూత్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో థియేటర్లలో సందడి చేసినఒక మూవీ, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన ర్ మూవీ పేరు “బ్లాక్ పాంథర్ ది స్టోరీ ఆఫ్ ఎమిలి అండ్ జాకబ్” (The story of emilie and jacob)ఈ మూవీ ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో నడుస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
తల్లిదండ్రులను కోల్పోయి బాధపడుతున్న ఎమిలీ అనే అమ్మాయికి, మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళ కంపెనీ అప్పులలో కూరుకు పోయిందనే వార్త ఎమిలీని కలచివేస్తుంది. కంపెనీ అప్పులను తన ఇంటిని అమ్మి తీర్చాలనుకుంటుంది. ఆ విషయం తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పి ఇంటిని అమ్మాల్సిందిగా కోరుతుంది. ఇది ఇలా ఉంటే ఏమీలికి ఒక తమ్ముడు జాకబ్ కూడా ఉంటాడు. అతనికి ఈ విషయం చెప్పకూడదు అనుకుంటూనే, చెప్పాల్సి వస్తుంది. నాకు ఆస్తులు అవసరం లేదని నువ్వుంటే చాలని జాకబ్ యమలీతో అంటాడు. ఎమిలీ, జాకబ్ అక్కడే దగ్గరలో ఉన్న ఒక పర్వత ప్రాంతాన్ని ఎక్కడానికి వెళ్తారు. జాకబ్ ఏమిలీ నీ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలోనే ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గర అయిపోతారు. ఇంతలో అక్కడికి ఇంటిని కొనడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంటిని అమ్మేశాక నాతో పాటు నువ్వు లండన్ వచ్చేయ్ అని ఎమిలీతో జాకబ్ అంటాడు.
ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండటంతో జాకబ్ తో రావడానికి ఒప్పుకోదు. జాకబ్ కోపంతో ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎమిలీ బాయ్ ఫ్రెండ్ వదిలేసి జాకబ్ ను వెతుక్కుంటూ వెళుతుంది. ఎంత వెతికినా జాకబ్ జాడ తెలియకపోవడంతో ఎమిలీ నిరాశపడుతుంది. చివరికి ఒక పర్వతం మీద జాకబ్ ఉన్నట్లు తెలుసుకుంటుంది. ఆ తర్వాత జాకబ్ తో కలసి ఎమిలీ జీవిస్తుందా? ఆ పర్వత ప్రాంతం నుంచి జాకబ్ తిరిగి వస్తాడా? వీళ్ళ కంపెనీ కష్టాల్లో నుంచి బయటపడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “బ్లాక్ పాంథర్ ది స్టోరీ ఆఫ్ ఎమిలి అండ్ జాకబ్” (The story of emilie and jacob) యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని మూవీ లవర్స్ ఒంటరిగా చూడటమే బెట్టర్.