BigTV English

Glowing Skin: ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం

Glowing Skin: ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం

Glowing Skin:చలికాలంలో చర్మం తరచుగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీని కారణంగా చర్మం సాగదీయినట్లు అనిపిస్తుంది. అందువల్ల, ఈ సీజన్‌లో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం, ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. చర్మాన్ని తేలికగా ఎక్స్‌ఫోలియేట్ చేసే హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మంలోని తేమ కోల్పోకుండా ఈ వస్తువులతో డెడ్ స్కిన్ సెల్స్‌ను శుభ్రం చేయండి:

చలికాలంలో చర్మంపై సహజ తేమ లేకపోవడం, దాని కారణంగా చర్మం పొడిబారడం వల్ల దురదగా అనిపిస్తుంది. చల్లని గాలులు, కఠినమైన చర్మ ఉత్పత్తులను ఉపయోగించడం, వృద్ధాప్యం లేదా నీటి కొరత వంటి అనేక కారణాల వల్ల ఇది జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో, కొన్ని సహజమైన వస్తువులతో స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ అవుతంది. ఇది పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రభావవంతమైన పరిష్కారం.


వీటిని సరైన పరిమాణంలో , తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్లతో చేయడం మంచిది. ఇది చర్మం నుండి డెడ్ స్కిన్‌ను తొలగించి, చర్మంపై మెరుపును తిరిగి తెస్తుంది. కొన్ని సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌ల గురించి తెలుసుకుందామా.

స్కిన్ ఎక్స్‌ఫోలియేటింగ్ :
వోట్మీల్- వోట్మీల్ చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్. ఇది చర్మం పైభాగంలో ఉన్న మృతకణాలను తొలగించి చర్మానికి తేమను అందిస్తుంది. ఓట్ మీల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు లేదా తేనెతో దీనిని కలిపి ముఖానికి రాసుకోవాలి .

తేనె, చక్కెర తేనె, పంచదార కలిపిన పేస్ట్ ఉత్తమ ఎక్స్‌ఫోలియేటర్. ఇందులోని చక్కెర చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా తేనె చర్మంలోని సహజ తేమను కాపాడుతుంది. దీనిని ముఖానికి అప్లై చేసి ఆపై కడగాలి.

కొబ్బరి నూనె, చక్కెర : కొబ్బరి నూనె, చక్కెరతో చేసిన ఈ పేస్ట్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ పేస్ట్ చాలా మేలు చేస్తుంది.

కాఫీ, కొబ్బరి నూనె :కొబ్బరినూనె, కాఫీతో తయారు చేయబడిన ఈ స్క్రబ్ చర్మం నుండి మృతకణాలను తొలగించడంలో, టానింగ్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి మెరిసేలా చేస్తుంది.
శనగ పిండి, మిల్క్ క్రీమ్- మిల్క్ క్రీం ఒక తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్. మిల్క్ క్రీమ్ చర్మానికి తేమను అందిస్తుంది. వీటితో తయారుచేసిన పేస్ట్‌ను చాలా కాలంగా చర్మ సంరక్షణగా ఉపయోగిస్తున్నారు.

Also Read: ప్రతి రోజు రాత్రి ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే గ్లాసీ స్కిన్

బొప్పాయి : బొప్పాయిలో ఎంజైములు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం నుండి మృతకణాలను తొలగించి, ఛాయను మెరుగుపరుస్తుంది. దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.

అవిసె గింజలు :  అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ తేమను కాపాడతాయి. దాని పొడిని కొబ్బరి నూనెలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ మెరిసిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×