BigTV English

OTT Movie : స్నేహితురాలని వెకేషన్ కు వెళ్తే… మత్తు ఇచ్చి ఏం చేశారో తెలిస్తే…

OTT Movie : స్నేహితురాలని వెకేషన్ కు వెళ్తే… మత్తు ఇచ్చి ఏం చేశారో తెలిస్తే…

OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇంచుమించు ఈ  సినిమాలు హర్రర్ ఇచ్చే థ్రిల్ ని  ఇస్తాయి. మొదటినుంచి చివరి వరకు వచ్చే సీన్స్ మూవీ లవర్స్ ని కుర్చీలకు కట్టిపడేస్తాయి. అటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమెరికన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వీకెండ్ అవే‘ (The weekend away). వెకేషన్ కి వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలలో ఒకరు మిస్ అయిపోతారు. మిస్ అయిపోయిన అమ్మాయిని వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

బెత్, కేట్ ఇద్దరు స్నేహితులు వెకేషన్ కి వెళ్తారు. ఈ వెకేషన్ కి కేట్ బెత్ ని ఆహ్వానిస్తుంది. అలా వీళ్ళిద్దరూ ఒక నైట్ పార్టీలో ఎంజాయ్ చేయాలనుకుంటారు. అపరిచితులతో డాన్స్ వేస్తూ ఉండగా మత్తులోకి జారుకుంటుంది బెత్. తిరిగి లేచి చూసేసరికి బెత్ తను స్టే చేసిన  హోటల్లో ఉంటుంది. కేట్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంటుంది. అప్పటినుంచి ఆమె కనపడకుండా పోతుంది. పోలీసులకు బెత్ కంప్లైంట్ చేస్తుంది. అయితే వాళ్లు బెత్ పైనే అనుమానపడతారు. ఈ క్రమంలో బెత్ కి ఆ ప్రాంతంలో బెత్ కి ఎవరూ తెలియకపోవడంతో ఒక టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేస్తాడు. ఆరోజు పార్టీలోకి వచ్చిన వ్యక్తులను కనుక్కొని వెంబడిస్తారు. నిజానికి వాళ్ళు ఆ రోజు ఆమెను హోటల్లో దింపుతారు. ఆ తర్వాత ఆమె బ్యాగ్ ని దొంగలించి పారిపోతారు. ఈ విషయం బెత్ కి చెప్తారు వాళ్ళు.

మరి గేట్ ఏమైందని కంగారు పడుతుంది బెత్. తన భర్త కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఎక్కడికైనా వెళ్లి ఉంటుందేమో అని, కంగారు పడకు అని చెప్తాడు ఆమె భర్త. ఈ క్రమంలో పోలీసులు కేట్ శవాన్ని కనిపెడతారు. కేట్ ఫోన్ ని ఎవరికి చెప్పకుండా తీసుకొని కాంటాక్ట్స్ ని చెక్ చేస్తుంది బెత్. ఆ ఫోన్లో పోలీస్ ఆఫీసర్ కి ఎక్కువసార్లు కాల్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు బెత్ కి అర్థమవుతుంది పోలీస్ ఆఫీసర్ తో కేట్ రిలేషన్ లో ఉండేదని. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. మరోవైపు కేట్ కి బెత్ భర్తతో సంబంధం ఉంటుంది. ఈ విషయం కూడా బెత్ కనుక్కుంటుంది. చివరికి కేట్ ని చంపింది ఎవరు? పోలీస్ ఆఫీసర్ చంపాడా? ఈ హత్యకు, బెత్ భర్తకు సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ అమెరికన్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×