BigTV English

Allu Arjun : లవర్స్ మధ్య చిచ్చుపెట్టిన అల్లు అర్జున్ మూవీ .. యువతి పరిస్థితి విషమం…

Allu Arjun : లవర్స్ మధ్య చిచ్చుపెట్టిన అల్లు అర్జున్ మూవీ .. యువతి పరిస్థితి విషమం…

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన మూవీ పుష్ప 2.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.. మూడు వారాలు అవుతున్నా కూడా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. 2000 కోట్లు రాబట్టే దిశగా మూవీ సాగుతుంది.. సినిమా టాక్ అయితే బాగానే ఉంది కానీ రోజుకో వివాదం మాత్రం బన్నీని వదలడం లేదు. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. దాని నుంచి లాక్కొలేక సతమాతమవుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో సమస్య వచ్చి పడింది. ఇద్దరు లవర్స్ మధ్య పుష్ప 2 మూవీ చిచ్చు పెట్టింది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..


గత కొద్ది రోజులుగా పుష్ప 2 మూవీ సినిమా టాక్ కన్నా కూడా ఏదొక వివాదం సినిమా చుట్టూ ఉంటుంది. ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ మీద చలనం లేకుండా ఉన్నారు. ఈ వివాదం అల్లు అర్జున్ ను వదల్లేదు. తప్పు అంతా అల్లు అర్జున్ దే అని కార్నర్ చేస్తున్నారు.. ఈ ఘటన పై బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ మళ్లీ చుక్కెదురు అయ్యేలా కనిపిస్తుంది.. ఇక ఇప్పుడు మరో ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ యువ స్టూడెంట్ తన ఎగ్జామ్‌లో ఏకంగా 72 వేల సార్లకి పైగా పుష్ప 2 నామ జపం రాసి అదేదో రామ కోటి అన్నట్టుగా షాకిచ్చాడు. ఇదిలా ఉండగా ఇపుడు మరో క్రేజీ ఇన్సిడెంట్ వార్తల్లో వైరల్ గా మారింది. అయితే ఈసారి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిందట. ఈసారి పుష్ప 2 ఇద్దరు ప్రేమికుల నడుమ చిచ్చు పెట్టిందట..

అదేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. వారణాసిలోనే బి హెచ్ యూకి చెందిన ఓ యువతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుందట. మరిన్ని వివరాల్లోకి వెళితే ఆ యూనివర్సిటీకి చెందిన అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. అయితే ఇపుడు హిందీ ఆడియెన్స్‌లో పుష్ప 2 మేనియా నడుస్తున్న నేపథ్యంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని అల్లు అర్జున్ సినిమా చూడాలని కోరిందట.. కానీ అతను నేను పుష్ప సినిమాను అస్సలు చూడను అని మొండికేసి కూర్చున్నాడట. అంతే తన బాయ్ ఫ్రెండ్ ఆ సినిమా చూడలేదు అని ఈమె ఆత్మహత్యాయత్నం చేసేవరకు వచ్చిందట. ఈమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ షాకింగ్ వార్త ఇపుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.. దీన్ని బట్టి చూస్తే పుష్ప క్రేజ్ నార్త్ లో ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం 900 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా అక్కడ సినీ ట్రాకర్స్ చెబుతున్నారు. మరి ఈ లెక్కలు ఎక్కడ ఆగుతాయో చూడాలి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాసుల వర్షం కురుస్తుంది.. త్వరలోనే రెండు వేల కోట్లు రాబట్టడం పక్కా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×