E-Paper
Advertisement

OTT Movie : ఓటిటిలోకి దేవర హీరోయిన్ స్పై థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : ఓటిటిలోకి దేవర హీరోయిన్ స్పై థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చు అంటే?
Advertisement

OTT Movie : థియేటర్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సందడి మొదలైంది. రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఊచకోత కోయడం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఓటిటిలోకి ‘దేవర’ హీరోయిన్ జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రను పోషించిన మూవీ ఒకటి రాబోతోంది. ‘దేవర’ మూవీలో కంప్లీట్ రొమాంటిక్ లుక్ లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో మాత్రం డిఫరెంట్ గా కనిపించింది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది? స్టోరీ ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.

జాన్వికి దొరకని ఆదరణ 

Advertisement

థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న సినిమాలు కొన్ని ఓటిటిలో మాత్రం భారీ వ్యూస్ తో టాప్ లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జాహ్నవి కపూర్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ హిందీ చిత్ర సినిమాలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకుల్లో తల్లి మీద ఉన్న అభిమానాన్ని, తండ్రికి ఉన్న బ్యాగ్రౌండ్ ని బేస్ చేసుకుని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అండదండలతో ఛాన్స్ లు అందుకుంది ఈ బ్యూటీ. అందగత్తెగా కోట్లాదిమంది మనసులు దోచుకున్న ఈ బ్యూటీ నటిగా మాత్రం ఇంకా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మనం చెప్పుకుపోయే మూవీ తో జాన్వి ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. ఈ మూవీని ‘దేవర’ రిలీజ్ కానున్న నేపథ్యంలో నెలకొన్న సందడిని క్యాష్ చేసుకోవడానికి, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత డైరెక్టర్ సుదాన్ష్ సరియా దర్శకత్వం వహించగా, జాన్వి కపూర్ తో పాటు గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, తాయంగ్ చాంగ్, సచిన్ ఖేడేకర్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించారు. వినీత్ జైన్ ఈ ప్రాజెక్టును నిర్మించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

దేశభక్తి మెండుగా ఉన్న ఐఏఎస్ అధికారిణి సుహానా భాటియా. అయితే పలు కారణాల వల్ల తరచుగా అవమానాలకు గురయ్యే సుహాన ఒక అండర్ వరల్డ్ క్రిమినల్ తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఉన్నతాధికారులలో ఈమె దేశ ద్రోహం చేస్తుందని అనుమానాలు నెలకొంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ క్రిమినల్ తో పాటు సుహాన లండన్ లోని ఒక ఎంబసీలో చిక్కుకుంటుంది. మరి అక్కడ నుంచి హీరోయిన్ బయట పడగలిగిందా? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు దేశద్రోహి అంటూ ఆమెను అందరూ అవమానిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ‘ఉలజ్’ అనే సినిమాను చూడాల్సిందే. అయితే ఈ మూవీని ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఓటిటిలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు గానీ ప్రస్తుతం జాన్వి కపూర్ ఆశలన్నీ ‘దేవర’ మూవీపైనే ఉన్నాయి.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×