BigTV English

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhale Unnade OTT : టాలీవుడ్ యంగ్ హీరో తరుణ్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు లైంగిక వేధింపుల కేసు తన పై ఉన్నా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒక నెల గ్యాప్ లోనే మూడు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒక పురుషోత్తముడు సినిమా మాత్రమే ఓ మాదిరిగా ఆకట్టుకుంది.. మిగిలిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే భలే ఉన్నాడే సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి రెండు వారాలు పూర్తి అయ్యింది. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది.. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..


రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి తమ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది..

ఈ సినిమా కథ విషయానికొస్తే..


డైరెక్టర్ మారుతి సమర్పణలో భలే ఉన్నాడే రావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే కొద్దిగా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ వరుస వైఫల్యాలతోపాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ కూడా భలే ఉన్నాడేపై ఆశలు పెట్టుకున్నాడు. గతంలో వచ్చిన రెండు సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు వచ్చిన సినిమా భలే ఉన్నాడులే కాస్త పర్వాలేదనిపించింది.

ఈ మూవీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపించాడు. పెళ్లి కూతుళ్లకు చీరలు కట్టే రాధ అనే ఓ భిన్నమైన పాత్రలో రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటించాడు. చేసేది అలాంటి వృత్తే అయినా.. అతనికి ఆడాళ్లంటే భయం, భక్తి, గౌరవం. అలాంటి వ్యక్తి జీవితంలోకి కృష్ణ అనే ఓ గడుసరి అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆడవాళ్లకు అతడు దూరంగా ఉండటానికి కారణమేంటి? అన్నది ఈ సినిమా కథ.. రాజ్ తరుణ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా.. మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నీ అంతంతమాత్రంగానే పండాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర అతనికి మరో నిరాశ తప్పలేదు. థియేటర్లలో పెద్దగా మెప్పించలేదు కానీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. థియేటర్లలో అంతంత మాత్రమే అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటీలో మంచి టాక్ ను అందుకుంటేనే కొంతవరకైనా సినిమాకు లాభాలు వస్తాయి. లేకుంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయినట్లే .. చూడాలి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×