BigTV English

OTT Movie : ప్రియుడితో ఏకాంతంగా…. భార్య ప్రైవేట్ వీడియో లీక్

OTT Movie : ప్రియుడితో ఏకాంతంగా…. భార్య ప్రైవేట్ వీడియో లీక్

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్ది రోజుల తేడాతో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వెబ్ సిరీస్ లు మాత్రం డైరెక్ట్ గానే ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. మంచి కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ పేరు ‘ఉత్తోరన్‘ (Uttoron). ఈ మూవీలో భార్య భర్తలు సంతోషంగా ఉన్న సమయంలో ఒక వీడియో వీరి  కుటుంబంలో అలజడి రేపుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ప్రేరణ, అరుణబ్ ఇద్దరు భార్య భర్తలు హనీమూన్ కి వెళ్లి ఇంటికి వస్తారు. అరుణబ్ డాక్టర్ గా తన వృత్తిని కొనసాగించగా, ప్రేరణ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. స్కూల్లో అందరికీ ప్రేరణ ఫేవరెట్ టీచర్. ప్రేరణకి నీల్ అనే ఒక మరిది ఉంటాడు. ఇతడు ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రేరణ ఏకాంత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ప్రేరణ మరొక వ్యక్తితో ఏకాంతంగా గడిపే సీన్లు ఉంటాయి. ఇది వైరల్ కావడంతో అందరూ ఆమెను దూరం పెడుతూ ఉంటారు. ఆ వీడియొని ప్రియ చూసి నీల్ కి పంపిస్తుంది. అది మార్ఫింగ్ అని కొట్టిపడేస్తాడు నీల్.  అయితే స్కూల్లో పిల్లలు కూడా ప్రేరణని ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియక సతమతమవుతూ ఉంటుంది ప్రేరణ. ఇంట్లో అత్తమామలతో సహా భర్త కూడా ఆమెను దూరం పెడతారు. ఆమె తల్లిదండ్రులు సైతం ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడరు. మరిది నీల్ మాత్రం ఆమెతో మాట్లాడుతూ ధైర్యం చెప్తాడు.

ఆ వీడియో మార్ఫింగ్ చేసి ఎవరో వదిలారని, దానికి నువ్వు బాధపడకూడదని ఆమెకు చెప్తాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇద్దామని నీల్ చెప్తాడు. ఈలోగా స్కూల్లో ప్రేరణ క్లాసులు తీసుకోకూడదని పిల్లల పేరెంట్స్ ధర్నా చేస్తారు. అందుకు ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి పోలీస్ స్టేషన్ కి ఫ్యామిలీతో సహా వచ్చిన ప్రేరణ ఆ వీడియోలో ఉన్నది తనే అని అందరికీ షాక్ ఇస్తుంది. నా ఇష్టప్రకారమే నా మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపానని పోలీసులకు చెప్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత భర్త భార్య ను దగ్గరికి రానిస్తాడా? ప్రేరణ మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు అలా చేసింది? ఈ సమాజాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని చూసేయండి.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×