trinayani serial today Episode: చాలా సేపటి నుంచి మా ఆయన కనిపించడం లేదు ఇంటికి ఎప్పుడొస్తాడో ఏమో అని హాసిని అంటుంది. ఎదురుగానే ఉన్నాడు కదమ్మా అంటూ పావణమూర్తి చెప్పగానే చీచీ ఈయనేంటి మా ఆయన అంటూ తిడుతుంది. దీంతో విక్రాంత్ చూడు బ్రో నయని వదినను ఇక్కడే పెట్టుకుని మీరు ఇక్కడ లేదని అంటున్నారు. అందుకే హాసిని వదిన కూడా అలా మాట్లాడుతుంది అని చెప్తాడు. మరి అర కోటి ఎందుకు కట్టినట్టు అని తిలొత్తమ్మ ప్రశ్నించగానే అది నేను చెప్తాను అత్తయ్య.. అంటూ రెండు నెలల గడిస్తే కానీ నా పరిస్థితి ఏంటని చెప్పలేమన్నా డాక్టర్లు వారం రోజుల్లోనే నేను లేచి వచ్చేలా చేశారు అందుకే మరో 8 లక్షలు బోనస్‌గా ఇచ్చాను అంటుంది నయని.
మంచి పని చేశారు. రెండు నెలలు ట్రీట్‌మెంట్ అంటే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేవో అంటాడు విశాల్. మరి డబ్బులు కట్టకపోతే ట్రీట్‌మెంట్ చేయం అని హాస్పిటల్ వాళ్లు ఎందుకు చెప్పారు అని వల్లభ ప్రశ్నిస్తాడు. నాకు మేలు చేసినట్టే రోజు వచ్చి పోయే పేషెంట్ల గురించి చెప్పాను. మీకు అలా అర్థం అయింది అనుకుంటా.. అంటుంది నయని. ఇంతలో పావణమూర్తి అక్కాయ్ మీ మనసులో నయని అమ్మ మీద అనుమానపు సెగలు ఇంకా ఉన్నాయి అన్నమాట అంటాడు. ఆ సెగలు మా ఆయనకు తగిలి నిప్పుల మీద కాలు వేసిన కోతిలాగా ఎగురుతున్నాడు అంటుంది హాసిని.
నాకు మాత్రం ఇంకా అనుమానం తీరలేదు అంటుంది తిలొత్తమ్మ.. ఈ విషయాలు అన్ని పక్కకు పెట్టండి అత్తయ్యా అది మీకే మంచిది అంటుంది నయని. ఇదంతా పక్కన పెట్టండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేయాలో ఆలోచించండి అంటాడు విశాల్. ఎవరి ఐడియా బాగుంటుందో వాళ్లకు ఐదు లక్షలు బోనస్ అంటుంది హాసిని. తర్వాత విశాల్ బెడ్ రూంలోకి వెళ్లి దాక్కుంటాడు వల్లభ. ఇంతలో లోపలికి వస్తారు విశాల్, నయని. నయని నిన్నటి నుంచి నీ నోటి నుంచి త్రినేత్రి అనే మాటే రావడం లేదు గమనించావా..? అని అడుగుతాడు. అసలు నేను నయని అయినప్పుడు త్రినేత్రి అనే పేరు ఎందుకు వస్తుంది అంటుంది నయని. ఇంతలో వల్లభ సౌండ్ విన్న నయని ఏదో అలికిడి అయింది అని అడుగుతుంది నయని.
బహుషా అది నా గుండె చప్పుడు అయ్యుంటుంది. చాలా రోజులు అయింది కదా విని అంటాడు విశాల్. మీరు ఊరుకోండి బాబుగారు ఇక్కడ ఏదో అలికిడి అయింది అంటూ వెతుకుతుంది నయని. విశాల్ బెడ్ వెనక్కి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్యా అని అడుగుతాడు. భయంతో నవ్వుతూ వల్లభ బయటకు వస్తాడు. మంచం రిపేర్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు బావగారు అని నయని అడుగుతుంది. ఏం లేదు న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం మీరు మంచి ఐడియా ఆలోచిస్తారు అది విని నేనే ఐదు లక్షలు గెలుచుకోవాలని వచ్చాను అంటూ రూంలోంచి వెళ్లిపోతాడు వల్లభ.
రూంలో లిల్లీస్ హాస్పిటల్ గురించి.. నయనికి జరిగిన ట్రీట్‌మెంట్ గురించి విక్రాంత్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో సుమన వచ్చి మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అని అడుగుతుంది. సరేలే వెళ్లు అంటాడు విక్రాంత్.. ఎక్కడికి హాస్పిటల్ కా అంటూ అడుగుతుంది సుమన. దీంతో హాస్పిటల్‌కు వెళ్లి ఏం చేయాలి అని అడుగుతుంది సుమన. ఇంతలో దురందర వచ్చి నేను చెప్తాను విక్కి అంటుంది. ఏం చెప్తారు అని సుమన అడుగుతుంది. ఏం లేదు అక్కడికి వెళ్లి నయని కట్టిన బిల్లుల వసూలు చేసుకుంటుందేమో అంటుంది.
దీంతో సుమన కోపంగా నన్ను అంతంత మాటలు అంటే మీరు మీకు పుట్టబోయే బిడ్డ సుఖంగా ఉండరు అంటూ తిడుతుంది. దీంతో దురందర ఏడుస్తుంటే అత్తయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి అని విక్రాంత్ అడుగుతాడు. హాస్పిటల్‌కు స్కానింగ్‌కు వెళ్లాలి నువ్వు తోడుగా వస్తావేమోనని వచ్చాను అంటుంది దురందర. మీరు వెళ్తే డబ్బులు మీతోనే పెట్టించాలని చూస్తుంది అందుకే మిమ్మల్ని రమ్మంటుంది అని సుమన అనగానే సరేలే అత్తయ్యా మామయ్యను కూడా రమ్మను ముగ్గురం కలిపి వెళ్దాం అని చెప్తాడు.
రూములోకి వెళ్తున్న గాయత్రి పాపను పట్టుకోబోయిన తిలొత్తమ్మ కిందపడుతుంది. దీంతో గట్టిగా అరుస్తుంది. అందరూ హాల్లోకి పరుగెత్తుకొస్తారు. ఏం జరిగిందని అడుగుతారు. గాయత్రి పాప కింద పడేసిందని చెప్తారు. అరేయ్ ఈ చీర మా అక్కది అని సుమన చెప్పగానే చివరకు చీరలు కూడా దొంగతనం చేస్తున్నావా..? బ్రో అంటూ విక్రాంత్, వల్లభను అడుగుతాడు. పడుకునే టైంలో చీరలు పట్టుకొచ్చి పక్కగదిలోకి దూర్చే అలవాటు ఎందుకుందో ఆ పిల్లను అడగండి ముందు అంటుంది సుమన.
దీంతో విక్రాంత్ పెద్దమ్మ ఏ పని చేసినా లాజిక్ ఉంటుంది అంటాడు. గాయత్రి బజ్జోకుండా ఆడుకుంటున్నావేంటమ్మా అని నయని అడుగుతుంది. ఇలా చీరలు తీసుకురాకుండా ఉండమని చెప్పు అంటాడు వల్లభ. ఇంతలో వదిలేయండి రేపు ఇల్లంతా శుభ్రం చేయించాలి కదా..? అత్తయ్యా తాళాలు నయనికి ఇవ్వండి అని విశాల్ చెప్పగానే తాళాలా..? అంటూ షాక్ అవుతుంది దురందర. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?