OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అటువంటి సినిమాలు అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. ఒక మంచి మెసేజ్ తో వచ్చిన సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్ (Youtube)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘మాతృభూమి‘ (Matrubhoomi). అమ్మాయిలు భారం అనుకొని పుట్టినప్పుడు చంపేస్తే, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
చటర్జీ తన ఐదుగురు కొడుకులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇతని భార్య అనారోగ్యంతో చనిపోయి ఉంటుంది. అయితే ఇంట్లో కొడుకులు వయసుకు వస్తారు. పెళ్లి చేయమని పెద్దకొడుకు తండ్రిని వేధిస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సంబంధాలు చూడటానికి ఒక పంతుల్ని పిలిపిస్తాడు చటర్జీ. ఎదురు కట్నం ఎంతైనా ఇస్తానంటూ అతనికి చెప్తాడు. చుట్టుపక్కల ఆడపిల్లలు ఎవరూ దొరకట్లేదని, దొరికితే నేనే మీకు కబురు చేస్తానని ఆ పంతులు చెప్తాడు. ఆ ఊరి జనం అమ్మాయిలు దొరక్క నానా తంటాలు పడుతూ ఉంటారు. కొంతమంది ముసలి వయసు వచ్చినాక, నాకు పెళ్లి కాలేదని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్లంతా కలిసి ఆడపిల్లలు లేకపోవడంతో వీడియోలు చూసి ఆనంద పడుతూ ఉంటారు. ఒకరోజు పంతులు చెరువుగట్టు దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని వెంబడించి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అమ్మాయి తండ్రితో మీ అమ్మాయికి పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఎదురుగా ఇస్తానని చెప్తాడు. అందుకు ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకుంటాడు. పంతులు చటర్జీకి విషయం చెప్పి అమ్మాయి ఇంటికి రప్పిస్తాడు. అయితే చటర్జీ ఈ అమ్మాయిని తన ఐదుగురు కొడుకులు కి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
ఇంటికి వెళ్ళాక ఫస్ట్ నైట్ కి పెద్ద కొడుకు ముందర వెళ్తాను అనుకుంటాడు. చటర్జీ వచ్చి నన్ను పట్టించుకోరా అని బాధపడతాడు. మీరు ఐదుగురు ఉన్నారు కదా, ఐదు రోజులు మీకు, రెండు రోజులు నాకు అంటూ పంపకాలు పెడతాడు. తండ్రి అలా అనడంతో వాళ్లు కూడా ఏమీ అనలేక ఒప్పుకుంటారు. అలా మొదటి రాత్రి ఆ అమ్మాయికి మామ గారితో జరుగుతుంది. చీకట్లో విషయం తెలియని ఆ అమ్మాయి, తనతో గడిపింది మామగారని తెలిసి చాలా బాధపడుతుంది. ఇలా ఉంటే ఈ ఫ్యామిలీలో ఆ అమ్మాయిని కోరికలు తీర్చుకోడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. ఆఖరి వాడు మాత్రం ఆమెతో ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి కూడా అతనితో ప్రేమగా ఉంటుంది. ఇది చూసిన మిగతా అన్నదమ్ములకు అతని మీద ఈర్ష కలుగుతుంది. వీరందరూ కలిసి చిన్న వాడిని చంపేస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవడంతో ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. చివరికి వీళ్లంతా కలిసి ఆ చిన్న పాపని చంపేస్తారా? ఆ అమ్మాయి వీళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.