OTT Movies : థియేటర్లలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అయిన వాటి ఫలితాలు స్టోరీ మీదే ఆధారపడి ఉంటాయి.. అక్కడ వచ్చే సినిమాలు కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఓటీటీలో వచ్చే సినిమాలు మాత్రం మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఓటీటీ లవర్స్ పెద్దగా ఆసక్తి చూపిస్తున్నారు. యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న బెస్ట్ బోల్డ్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం ఓసారి తెలుసుకుందాం..
ఏక్ మినీ కథ..
టైటిల్ వింటేనే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది కదూ.. అవును అక్షరాలా మీరు అనుకున్నది నిజమే.. శృంగారంలో మగాళ్ల పురుషాంగం సైజ్ పెద్దగా ఉండటం ముఖ్యం అని కొందరు అభిప్రాయ పడుతుంటారు. కామెడీ తరహాలో చూపించిన సినిమానే ఏక్ మినీ కథ. సైజు పెద్దగా ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుందని కొందరు మగవాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. అలాంటిది కేవలం బ్రమే అని చెప్పడానికి ఈ సినిమాని దొరికించారు. కామెడీ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఇది బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఛత్రవాలి..
సెక్స్ గురించి కొందరికి బాగా తెలుసు. మరి కొందరికి పెద్దగా అవగాహనా ఉండదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్‌గా నటించిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం ఛత్రివాలి. సేఫ్ సెక్స్, అందులో అపరిచితులతో పాల్గొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇందులో చూపించారు.. కాస్త బోల్డ్ ఉన్నా కూడా ఈ సినిమాలో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో జనాలు ఎక్కువగా ఆదరించారు.. ఇది జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
గర్ల్స్ విల్ బీ గర్ల్స్..
ఈ మూవీ నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకున్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కని కుశ్రుతి, ప్రీతి పాణిగ్రహి నటించిన ఈ సినిమాలో 16 ఏళ్ల కూతురికి కౌమార దశలో వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్ ఆమె చదువులకు ఆటంకం కలగకూడదని పరితపించే తల్లి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.
వివేకానందన్ వైరల్..
మలయాళ ఇండస్ట్రీలో ఈమధ్య బోల్డ్ సినిమాలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అలాంటి సినిమాలలో వివేకానందన్ వైరల్ అనే సినిమా కూడా ఒకటి. ఈరోజు మూవీలో భర్తకు విపరీతమైన సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. విలన్ షైన్ టామ్ చాకో, స్వాసిక, గ్రేస్ ఆంటోనీ, మరీనా మైఖేల్ కురిసింగల్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.. మితి మీరిన శృంగారపు సన్నివేశాలు ఇందులో ఉంటాయి.. ఈరోజు మూవీ ప్రస్తుతం ఆహా లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది..
ఇలాంటి సీన్లు ఎక్కువ ఉన్న సినిమాలలో ఇవే బెస్ట్ సినిమాలు. యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఈ సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి..