Sherlyn Chopra: షెర్లిన్ చోప్రా అంటే అందరికీ తెలియకపోవచ్చు గాని కొంతమంది కుర్రాళ్లకు మాత్రం తెలియకుండా ఉండదు. ప్లేబోయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి భారతీయ మహిళ షెర్లిన్ చోప్రా. మోనా చోప్రా అని కూడా పిలవబడే ఈమె బాలీవుడ్ నటి. ప్లేబోయ్ (Playboy) అనేది కేవలం పురుషుల కోసం అమెరికాలో ప్రచురించబడుతున్న ప్రఖ్యాత మాస పత్రిక. ఇందులో వివిధ భంగిమల్లో స్త్రీల యొక్క పూర్తి నగ్న ఫోటోలు ఉంటాయి. ఈ పత్రిక వ్యవస్థాపకుడు ‘హగ్ హెఫ్నర్’. 1956 లో మొట్టమొదటి సారిగా హగ్ హెఫ్నర్ అతని సహచరులతో కలిసి చికాగోలో పత్రికను అచ్చువేయడం ప్రారంభించాడు. ప్రపంచంలొ పురుషులు అత్యధింకంగా కొనుగోలు చేసే పత్రిక ప్లేబోయ్. ప్లేబోయ్ పత్రికలో పూర్తి నగ్నం భంగిమల్లో ఫోజులిచ్చిన మొట్టమొదటి భారతీయ మహిళగా షెర్లిన్ చోప్రా ప్రసిద్ధికెక్కింది.
హాలీవుడ్ ఎంట్రీ
గేమ్, టైమ్ పాస్ వంటి ఎన్నో హిందీ చిత్రాల్లో నటించిన షెర్లిన్ 2002 లో బీపర్ అనే హాలివుడ్ సినిమాలో నటించింది. జూమ్ ఛానల్ వారి ఇంటర్యూలో అమితాబ్ బచ్చన్ వంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని ఉందనే అభిప్రాయాన్ని షెర్లిన్ చోప్రా వ్యక్తం చేసింది. 2005 లో దోస్తీ, ఫరెవర్ ఫ్రెండ్స్ సినిమాల్లో, 2006 లో జవాని దివానీ అనే సినిమాలో, 2006 లో నాటీ బాయ్ అనే సినిమాలో, 2007 లో రఖీబ్ అనే సినిమాలో నటించింది. బిగ్ బాస్ హౌస్ కి సెక్సీగా ఆకుపచ్చ లేహంగా చోళీ దుస్తుల్లో వెళ్ళింది. నవంబరు 2012 న ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై షెర్లిన్ చోప్రా పూర్తి నగ్న ఫొటో ప్రచురితమైంది. లాస్ ఎంజల్స్ లో తనను నగ్నంగా ఫొటో తీసిన ‘హగ్ హెఫ్నర్ ను “భూమి పై అత్యంత దయ గల మనిషి”గా ప్రశంసించింది.
షెర్లిన్ చోప్రాపై జనాగ్రహం
షెర్లిన్ చోప్రా పోర్న్ వీడియోస్ చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ తరుణంలో షెర్లిన్ కు మోసం జరిగినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. స్వయంగా ఆ వీడియోలో షెర్లిన్ మాట్లాడుతూ…
దుర్గామాత ఆశీర్వాదానికి, తాను చేసే చెత్త పనికి లింకు పెట్టింది. షెర్లిన్ ఒక్కో వీడియోకు దాదాపు 16 లక్షల రూపాయలు తీసుకుంటుందట. అయితే దానికి గాను ముందుగానే అగ్రిమెంట్ కూడా రాయించుకుంటుంది. అయితే తనతో మూడు వీడియోలు చేయించుకొని తనకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చింది. అలానే దుర్గామాత ఆశీస్సులు తనకు ఉంటాయని, తప్పకుండా తన డబ్బులు తన దగ్గరకు వస్తాయని ఆ వీడియోలు ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నువ్వు చేసిన చెత్త పనికి దుర్గామాత ఆశీస్సులు కి ఏమైనా సంబంధం ఉందా అంటూ ఏమైనా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Devakatta : నా సినిమాలో ఆ యాక్టర్ లేడు, కొంతమంది తప్పుగా రాస్తున్నారు