E-Paper
Advertisement

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు..వాటిని అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు..వాటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies : ప్రతివారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే చాలా మంది ఓటీటీలోకి వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. మూవీ లవర్స్ ను మరింతగా ఆకట్టుకోవడం కోసం ఓటిటి సంస్థలు బోలెడు సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తుంటాయి. ప్రతి వారం కొత్త సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి.. థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చే సినిమాలకే డిమాండ్ ఎక్కువ.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. మరి ఆలస్యం లేకుండా ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు ఇవే.. 

బైసన్ మూవీ.. 

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ మూవీలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ వీకెండ్ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, పశుపతి, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించారు. అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంటుంది.

నాడు సెంటర్.. 

Advertisement

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తనయుడు ఫీనిక్స్ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు.. ప్రస్తుతం నాడు సెంటర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.. సూర్య సేతుపతి, రేజినా, శశికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. నారు నారాయణ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. జియో హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

ఫ్యామిలీ మ్యాన్ 3.. 

గతంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్.. దానికి సీక్వల్గా ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా వచ్చేసింది. అది మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో ప్రస్తుతం ఆ సీజన్ కి సీక్వెల్ గా మరో సీజన్ ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్ కి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

Also Read:భరణికి షాకిచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..చివర్లో ట్విస్ట్..

వీటితో పాటుగా ఆస్కార్ నామినేషన్ల జాబితాలో నిలిచిన జాన్వీ కపూర్ చిత్రం ‘హోమ్‌బౌండ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ సినిమాలను చూడాలనుకునేవారు బెంగాల్ ఫైల్స్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు.. మహేంద్రన్, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర్మణ్యే వాధికారిస్తే’ సన్ నెక్ట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.. అదే విధంగా కన్నడ చిత్రం ‘ఉసిరు’ జియో హాట్ స్టార్, సన్ నెక్ట్స్‌లో వీక్షించవచ్చు.. ఇవి కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా ఉన్నాయి.. మరి మీకు నచ్చిన సినిమాని వెబ్ సిరీస్ ని మీకు నచ్చిన డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో చూసేయండి..

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×