Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మల్టీటాలెంట్ గురించి తెలిసిందే.నటుడిగానే కాదు దర్శకుడిగా, సింగర్‌గా, రైటర్‌గా మల్టీటాలెంట్‌తో దూసుకుపోతున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క మూవీస్ దర్శకత్వం చేస్తున్నాడు. హీరోగానే కాదు డైరెక్టర్‌గా సక్సెస్ అందుకుంటున్నాడు. ఇటీవల ఇడ్లీ కొట్టు చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతుంది. మరోవైపు హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తేరే ఇష్క్ మే మూవీతో బిజీగా ఉన్నాడు.
ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ధనుష్ మూవీ ప్రమో షన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన మూవీ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ధనుష్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కథ చెప్పినప్పుడు తనపై షాకింగ్ కామెంట్స్ చేశాడని అన్నాడు. ఈ సినిమా కథ చెప్పాడానిక నా దగ్గరి వచ్చినప్పుడు ఆయనను ఓ ప్రశ్న అడిగాను. అప్పుడు నా లుక్స్‌పై ఇలా అన్నాడు. డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ఒకరోజు తేరే ఇష్క్ మేన్ కథ వినిపించాడు.
అప్పుడు నేను ఈ కథకు నన్నే ఎందుకు తీసుకుంటున్నారు? అని అడిగా. అప్పుడాయన నీది గ్రేట్ లవ్ ఫెయిల్యూర్ ఫేస్ అన్నారు. అది విని షాక్ అయ్యా. తర్వాత ఇంటికి వెళ్లాక నా ముఖాన్ని అద్దంలో పదే పదే చూసుకున్నాను. ఆ తర్వాత దాన్ని ఒక కాంప్లీమెంట్‌గా తీసుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ధనుష్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కాగా తేరే ఇష్క్ మేన్ మూవీ యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కింది. ఇందులో ప్రేమికుల ఇద్దరు విడిపోవడం, లవ్ ఫెయిల్యూర్ అయిన హీరో కథ చూట్టు తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రచార పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
Also Read: Hrithik Roshan: వార్ 2 ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. దుబాయ్ వేదికగా షాకింగ్ కామెంట్స్
అలాగే ధనుష్ మరో సినిమా చేస్తున్నారు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది అతడి 54వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన సూపర్ హిట్ సాంగ్ వై దిస్ కొలవేరిపై ఊహించని కామెంట్స్ చేశారు. ‘త్రి మూవీ టైంలో ఏదో సరదగా చేసిన పాట అని, అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు అన్నారు. ఈ పాట వైరల్ అవ్వడం ఆనందంగానే ఉంది. కానీ, ఈ సక్సెస్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇది నాకు ఆశీర్వాదమో, శాపమో అర్థం కావడం లేదు’ అని అన్నారు.