E-Paper
Advertisement

OTT Platforms: ఏంటీ.. ఏడాదికి ఒక్కో ఓటీటీ ప్లాట్ఫారం ఆదాయం అన్ని వేలకోట్లా?

OTT Platforms: ఏంటీ.. ఏడాదికి ఒక్కో ఓటీటీ ప్లాట్ఫారం ఆదాయం అన్ని వేలకోట్లా?
Advertisement

OTT Platforms: ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక థియేటర్లలో సినిమా చూడడానికి ఎవరూ కూడా ఇష్టపడడం లేదు.ఈ బిజీ బిజీ లైఫ్ లో సినిమా చూడటం కోసం థియేటర్లో గంటలు గంటలు వెయిట్ చేసి టికెట్లు తీసుకోవడం వంటి రిస్కులు చేయాలనుకోవడం లేదు. నేరుగా ఓటీటీలో సినిమా చూసుకుంటే పోలా అన్నట్లు ఆలోచన చేస్తున్నారు. పైగా సినిమా విడుదలయ్యాక కచ్చితంగా నెల నుండి రెండు నెలల లోపు సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.అలా ఒక నెల రెండు నెలలు ఆగితే సినిమా ఓటీటీలో వస్తే ఇంటి నుండే చూడొచ్చులే అని చాలామంది థియేటర్లోకి వెళ్లి సినిమా చూడడం మానేస్తున్నారు. అలా ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది.

వేల కోట్లు సంపాదిస్తున్న ఓటీటీలు..

అయితే చాలా మంది సినీ ప్రేక్షకులు ఓటీటీలను చూడడం వల్ల ఓటీటీలకు భారీ డిమాండ్ పెరగడమే కాకుండా ఏడాదికి వందల కోట్లు సంపాదిస్తున్నారట. మరి ఇంతకీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంవత్సరానికి ఎన్ని కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి..? అందులో ఏ ఓటీటీ ఎక్కువ కోట్లు సంపాదిస్తోంది ? అనేది ఇప్పుడు చూద్దాం.. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్,షోస్ కూడా కొంతమంది ఓటీటీలోనే చూస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరం లేదా నెలకు ఒకసారి మనీ కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని నెల లేదా సంవత్సరం మొత్తం ఓటీటీ ద్వారా తమకు నచ్చిన షోస్, సినిమాలు చూసేస్తున్నారు.

నంబర్ వన్ స్థానంలో జియో హాట్ స్టార్..

Advertisement

అలా ఇప్పటి వరకు ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫార్మ్స్ లో సంవత్సరానికి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న ఓటిటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే జియో హాట్ స్టార్.. ఈ జియో హాట్ స్టార్ లో జియో సినిమా అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. జియో హాట్ స్టార్ లో లైవ్ క్రికెట్ తో పాటు బాలీవుడ్ సినిమా ప్రీమియర్స్,ఫ్యామిలీ షోస్ కూడా చూడవచ్చు. అలా జియో హాట్స్టార్ ఏడాదికి రూ.10,800కోట్ల రెవెన్యూను అందుకుంటోంది.

ఆ తర్వాత స్థానంలో నెట్ ఫ్లిక్స్ ఉంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా కూడా సినిమాలు, సీరియల్స్, షోస్ ఇలా ఎన్నో చూడవచ్చు.ఈ నెట్ ఫ్లిక్స్ ఏడాదికి రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది.

Advertisement

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫారం ఏడాదికి రూ.1,200 కోట్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇందులో కూడా సినిమాలు, సీరియల్స్, షోస్ వంటివి చూడవచ్చు.

వీటి తర్వాత నాలుగో ప్లేస్ లో సోనీ లివ్ ఏడాదికి రూ.1100 కోట్లు సంపాదించగా.. 5వ ప్లేసులో జీ 5 ఏడాదికి రూ.1050 కోట్ల ఆదాయాన్ని అందుకుంటుంది. ఇక చివరిగా ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ ఏడాదికి 150 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది.

అలా కొత్త సినిమాల్ని కొనుగోలు చేస్తూ ఎన్నో ఓటిటి సంస్థలు ప్రేక్షకుల బిజీ షెడ్యూల్ ని క్యాష్ చేసుకుంటున్నాయి. చాలామంది థియేటర్ లకు వెళ్లలేనివారు ఓటీటి ద్వారా సినిమాలు చూస్తారు. కాబట్టి ఇండస్ట్రీలో భారీ బజ్ ఉన్న సినిమాలతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని.. ఓటిటి హక్కులను కొనుగోలు చేసి సినిమా విడుదలైన నెల రెండు నెలల తర్వాత తమ ఓటీటిలో స్ట్రీమింగ్ చేస్తూ కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కేవలం కొత్త సినిమాలు మాత్రమే కాకుండా ఈ ఓటిటి ఫ్లాట్ఫామ్స్ ద్వారా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ షోలు కూడా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇకపోతే ఈ ఆదాయం కేవలం ఇండియన్ మార్కెట్ వద్ద మాత్రమే అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: iBomma : ఐ బొమ్మ నిర్వాహకుడికి భారీ శిక్షలు.. జీవితాంతం జైలు.. కోట్లల్లో ఫైన్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×