E-Paper
Advertisement

CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్

CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్
Advertisement

CSK: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ {CSK} జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. గత సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు నిరాశపరిచాయి. ఫలితంగా జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మెగా వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోకపోవడమే చెన్నై సూపర్ కింగ్స్ ఓటములకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాస్త బౌలింగ్ విభాగంలో పరవాలేదు అనిపించినా.. బ్యాటింగ్ లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.

Also Read: Mohammed Shami: బీహార్ ఎన్నిక‌ల‌పై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వివాద‌స్పద వ్యాఖ్య‌లు.. నితీష్ జీ అంటూ !

Advertisement

గత సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఓవరాల్ గా 14 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తామని ఐపీఎల్ సమయంలోనే మహేంద్రసింగ్ ధోని తెలిపాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్ లో పూర్తిగా నిరాశపరిచిన కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేసేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు సమాచారం.

సీఎస్కే లోకి సంజు:

చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా.. ఆ జట్టును వీడి రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు పసుపు జెర్సీలో సీఎస్కే తరఫున 2026 ఐపిఎల్ ఆడబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తమ కీలక ఆటగాళ్లను మార్చుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ సంజు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లోకి ట్రేడ్ అయ్యాడు. అతడి ఫీజు 18 కోట్లు అలాగే ఉంది. ఇక రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ లోకి వెళ్ళాడు. కానీ అతడి ఫీజు 18 కోట్ల నుండి 14 కోట్లకు తగ్గింది. ఇక ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్.. సీఎస్కే నుండి తన పాత జట్టు ముంబై ఇండియన్స్ లోకి 30 లక్షల ఫీజుతో తిరిగి వచ్చాడు.

Advertisement

ఇక గత సీజన్ లో జూనియర్ మలింగ గా పిలుచుకునే మతీషా పతిరనా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాట్ ద్వారా వచ్చిన పరుగుల కంటే వైడ్లతోనే ఎక్కువ పరుగులు సమర్పించాడు. నాథన్ ఎల్లీస్ ని పక్కన పెట్టి మరీ పతిరనా కు అవకాశం ఇస్తే దుర్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ తో చెన్నై సూపర్ కింగ్స్ లో అడుగుపెట్టిన మతీషా.. ఆ సీజన్ లో కేవలం రెండు మ్యాచ్ లే ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2023లో 12 మ్యాచ్ లలో 19, 2024లో 6 మ్యాచ్ లలో 4/28 బెస్ట్ తో 13 వికెట్లు పడగొట్టి సీఎస్కే మెయిన్ బౌలర్ అయ్యాడు. కానీ ఐపీఎల్ 2025లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఇతడిని కూడా రిలీజ్ చేసింది సీఎస్కే.

Also Read: Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌

సీఎస్కే డేంజర్ బ్యాటింగ్ లైనప్:

గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ లోని స్టార్ బ్యాటర్లు ఊహించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇది జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ క్రమంలో 2026 ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ డేంజర్ బ్యాటింగ్ లైనప్ ని ఏర్పాటు చేసుకుంది. 2026 ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే బ్యాటింగ్ లైనప్ చూస్తే.. ఋతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, శివమ్ దూబే, డేవాల్డ్ బ్రేవిస్ లాంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తుంది. ఈ లైనప్ చూస్తే నిజంగా భయంకరంగా ఉంది. దీంతో ఐపీఎల్ 2026 లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తన అధిపత్యాన్ని సాధించేందుకు పూర్తిగా సిద్ధమైందనే భావన కలుగుతుంది.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×