E-Paper
Advertisement

iBomma: ఐబొమ్మకు తెలంగాణ పోలీసుల షాక్.. కీలక నిందితుడి ఖాతాలో రూ.3 కోట్లు సీజ్

iBomma: ఐబొమ్మకు తెలంగాణ పోలీసుల షాక్.. కీలక నిందితుడి ఖాతాలో రూ.3 కోట్లు సీజ్

iBomma: తెలంగాణ పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అయిన ఇమ్మడి రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి అకౌంట్ లోని రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశారు.

ఆరు నెలలుగా గాలింపు

సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తామంటూ ఇటీవల ఐబొమ్మ బ్లాక్‌మెయిల్ కు పాల్పడింది. మీరు మా వెబ్‌సైట్‌పై కన్నేస్తే మేము మీ అందరి జీవితాలు రోడ్డున పడేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గత 6 నెలలుగా ఇమ్మడి రవి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఐబొమ్మ కారణంగా సినీ పరిశ్రమకు దాదాపు రూ.3 వేల కోట్ల వరకు నష్టం వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. సినిమా, వెబ్ సిరీస్ విడుదలైన గంటల్లోనే హెచ్.డి ప్రింట్‌ ఐబొమ్మలో పైరసీ విడుదల చేస్తున్నారు.

గతంలో ఏజెంట్లు అరెస్ట్

తెలుగుతో పాటు పలు సినిమాలను పైరసీ చేయడంపై ఐబొమ్మపై తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదును ఛాలెంజింగ్ తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకులపై దృష్టి పెట్టారు. ఈ వెబ్‌సైట్‌ కోసం పనిచేస్తున్న ఏజెంట్లపై దృష్టిపెట్టి వారిని అరెస్టు చేశారు. బిహార్, యూపీలలో ఐబొమ్మ ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు.

Also Read: Parakamani Case CI: పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సీఐ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

ఇటీవల పైరసీ ముఠా హైదరాబాద్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముఖ్యంగా ఐబొమ్మకు చెందిన సైబర్ నేరగాళ్లు ఉన్నారు. అనంతరం ఐబొమ్మ పోలీసులకు ఛాలెంజ్ విసిరింది. దీంతో దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి, అధునాతన పరికరాలతో పైరసీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులు పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అయిన రవిని అరెస్టు చేశారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×