E-Paper
Advertisement

The Taj Story OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న పరేష్ రావల్ వివాదాస్పద కోర్టు రూమ్ డ్రామా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

The Taj Story OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న పరేష్ రావల్ వివాదాస్పద కోర్టు రూమ్ డ్రామా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

The Taj Story OTT : ప్రపంచ వింతలో ఒకటైన తాజ్ మహల్ ను ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకుంటారు. అయితే దీని వెనుక కూడా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 1960లలో పి.ఎన్. ఓక్ అనే చరిత్రకారుడు షాజహాన్ తాజ్ మహల్ నిర్మించడానికి ముందే, అక్కడ అగ్రేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉండేదని వాదించారు. అప్పుడప్పుడు ఈ విషయం మీద చర్చలు కూడా జరుగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ‘ది తాజ్ స్టోరీ’ మూవీ కూడా తెరకెక్కింది. పరేష్ రావల్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా, తాజ్ మహల్ మూలాల గురించి చర్చిస్తుంది. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లోకి అడుగుపెడుతోంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కోర్ట్ రూమ్ డ్రామా పేరు ది తాజ్ స్టోరీ ‘The Taj Story’. తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను, స్విష్ ఫిలిమ్స్ పతాకంపై కే.ఏ. సురేష్, అమ్రిష్ గోయల్ కలసి నిర్మించారు. ఇది 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. సుమారు ₹25 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం సుమారు ₹20 కోట్ల లోపే వసూలు చేసి, ఆర్థికంగా నష్టపోయింది. ఇక మార్చి 13 నుంచి లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో పరేష్ రావల్ తాజ్ మహల్ చరిత్ర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత కోర్టులో పోరాడే గైడ్ పాత్రలో నటించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, విష్ణు దాస్ వాదనలను అడ్డుకునే పాత్రలో జాకీర్ హుస్సేన్ కనిపిస్తారు. గైడ్ కు మద్దతు ఇచ్చే ఒక జర్నలిస్ట్ పాత్రలో అమృత ఖాన్విల్కర్ నటించారు. 2 గంటల 45 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమాకు, వికాస్ గుప్తా సంగీతాన్ని అందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

తాజ్ మహల్ దగ్గర విష్ణు దాస్ (పరేష్ రావల్) అనే వ్యక్తి ఏళ్ల తరబడి గైడ్‌గా పనిచేస్తూ పర్యాటకులకు అక్కడి విశేషాలు వివరిస్తుంటాడు. అతను 30 సంవత్సరాలకు పైగా తాజ్ మహల్‌లో గైడ్‌గా పనిచేసిన అనుభవజ్ఞుడు కూడా. అయితే తాజ్ మహల్ అనేది మొఘలులు కట్టిన సమాధి కాదని, అది పూర్వం ఒక శివాలయం అని విష్ణు దాస్ గట్టిగా నమ్ముతాడు. ఒకరోజు అతను టూరిస్టులకు ఈ విషయం చెబుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనివల్ల పెద్ద గొడవ జరిగి, ప్రభుత్వం అతన్ని గైడ్ ఉద్యోగం నుండి తీసేస్తుంది. దీంతో ఇతగాడు తాను చెప్పిందే నిజమని నిరూపించడానికి కోర్టు మెట్లు ఎక్కుతాడు.

ఇక కోర్టులో విష్ణు దాస్ దాఖలు చేసిన పిటిషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక సామాన్యుడు అంత పెద్ద చారిత్రక కట్టడం వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టాలని చూడటం, దానికి ప్రభుత్వం, పురావస్తు శాఖ నుంచి ఎదురయ్యే అడ్డంకులు సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. చరిత్రకారుల వాదనలు, ఆధారాలను కోర్టు ముందు పెడుతూ సాగే ఈ డ్రామా చివరికి ఎలాంటి ముగింపుకు చేరుకుంది? తాజ్ మహల్ మూలాల గురించి కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? అనే ఈషయాలను ఈ సినిమాను చూసి తెలుసు కోవాల్సిందే.

Advertisement

Read Also : 40 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు… అనేక అవార్డులు గెలుచుకున్న ఈ క్రేజీ మూవీ చూశారా?

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×