E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలను మాత్రమే కిడ్నాప్ చేసే సైకో… వీడు అమ్మాయిలతో ఆడే ఆటలు చూసి తట్టుకోవడం కష్టం భయ్యా

OTT Movie : అమ్మాయిలను మాత్రమే కిడ్నాప్ చేసే సైకో… వీడు అమ్మాయిలతో ఆడే ఆటలు చూసి తట్టుకోవడం కష్టం భయ్యా
Advertisement

OTT Movie : సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో హింస తో కూడిన సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. సైకోలు ఎక్కువగా మనుషులను టార్చర్ పెట్టి చంపుతుంటారు. ఈ తరహా కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

Advertisement

ఈ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్లే టైమ్‘ (Play time). ఈ మూవీలో తప్పు చేస్తున్న అమ్మాయిలను తీసుకువచ్చి, వాళ్లతో ఒక గేమ్ ఆడుతూ కిరాతకంగా చంపుతుంటాడు సైకో కిల్లర్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఒక రెస్టారెంట్లో రోని అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఒక వారంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆమెతో ఫ్రెండ్స్ ఒక పందెం కాస్తారు. పెళ్లయితే మరొకరితో తిరిగే అవకాశం ఉండదు కాబట్టి, ఈరోజు ఎవరితోనైనా గడపాలని అడుగుతారు. అయితే అందుకు రోని ఒప్పుకోదు. తనకు కాబోయే భర్తని మోసం చేయలేనని చెప్తుంది. ఇంతలో రోనిని లూకాస్ అదే పనిగా చూస్తుంటాడు. రోని తనకి కాబోయే భర్తకి ఫోన్ చేసి, పికప్ చేసుకోవడానికి రావాలని అడుగుతుంది. అయితే ఆమెకు కాబోయే భర్త వేరే పార్టీలో, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ విషయం వీడియో కాల్ ద్వారా గ్రహించిన రొని ఫోన్ కట్ చేస్తుంది. అతడి మీద కోపంతో అక్కడికి వచ్చిన లూకాస్ తో ఏకాంతంగా గడుపుతుంది. ఆ తర్వాత లూకాస్ ఆమెకు మత్తు కలిపిన డ్రింక్ ఇచ్చి తనతో పాటు తీసుకెళ్తాడు. అలా ఇంకో ఇద్దరు పట్రీష, యాలి అనే అమ్మాయిలను కూడా తీసుకువస్తాడు. ఆ ఇల్లు ఒక దట్టమైన అడవిలో ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారుకాని  ఎక్కడికి వెళ్ళినా సైకో పట్టుకొని మళ్లీ ఇంట్లోకి తీసుకువస్తాడు. ఆ సైకో వీళ్ళకి ఒక గేమ్ పెడతాడు.

అడవిలో మీరు ఎక్కడికి వెళ్ళి అయినా దాక్కోండి నేను మిమ్మల్ని పట్టుకుంటే మీరు నా చేతిలో చస్తారు. ఒక వేల నేను పట్టుకోలేకపోతే బ్రతికి పోతారు. అని చెప్పి ఒక గేమ్ స్టార్ట్ చేస్తాడు ఆ సైకో. ఈ అమ్మాయిలు అడవిలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంతే ఈజీగా ఆ సైకో వాళ్లను వెంబడిస్తూ పట్టుకుంటాడు. మొదట పెట్రీషాను చంపేస్తాడు. మిగతా ఇద్దరు అక్కడి నుంచి మళ్లీ పారిపోతారు. వీళ్ళిద్దరూ ఈసారి ఒక పథకం వేస్తారు. చిగురికి సైకో నుంచి వీళ్ళిద్దరూ బయటపడతారా? ఆ సైకో అమ్మాయిలను మాత్రమే ఎందుకు చంపుతూ ఉంటాడు? మిగిలిన ఇద్దరూ సైకోని చంపడానికి వేసిన పథకం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ‘ప్లే టైమ్’ (Play time) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×