E-Paper
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.

ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని.. దాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు తెలిపారు.

Advertisement

వ‌రంగ‌ల్ ఔటర్ రింగు రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా ఉండాల‌న్నారు. వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టు నుంచే ఉమ్మడి ఖమ్మం, కరీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల ప్ర‌జ‌లు భ‌విష్య‌త్‌లో రాక‌పోక‌లకు వీలుగా ర‌హ‌దారులు నిర్మించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు.

టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితో హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ ఎదిగేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌న్నారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం పూర్త‌యితే మేడారం జాత‌ర‌తోపాటు ల‌క్న‌వ‌రం, రామ‌ప్ప ఇత‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు  దాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.

Advertisement

ALSO READ:  తెలంగాణ సొమ్ముల్ని ధారాదత్తం చేశారు.. మీ అరెస్ట్ ఆపడం ఎవరి వల్లా కాదు..

అటు పర్యాటకంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని నొక్కి వక్కానించారు. ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ‌, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ మౌలిక వ‌స‌తులు స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌, వ‌రంగ‌ల్ ఆర్డీవో స‌త్య‌పాల్ రెడ్డి పాల్గొన్నారు.

 

Related News

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×