Nithya Menen: సినీ పరిశ్రమలో హీరోయిన్లు కాస్త ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి ప్రవర్తించాలి.. అప్పుడే వారికి అవకాశాలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వారికి ఏదైనా నచ్చనిది నచ్చలేదని చెప్పినా అది వారి కెరీర్‌పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంటుంది. అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు ఉండే నటీమణులు కూడా ఉన్నారు. అందులో చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు నిత్యా మీనన్. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేదు అనిపిస్తే ఇట్టే రిజెక్ట్ చేసేస్తుంది నిత్యా మీనన్. అలాంటిది తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ఆడియో లాంచ్‌లో నిత్యా ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రవర్తన నచ్చలేదు
ఎప్పుడో ఒకసారి ఒక సినిమాను ఒప్పుకున్నా కూడా ఆ సినిమాలో తన నటనతో అందరిపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నిత్యా మీనన్ (Nithya Menen). ఆఫ్ స్క్రీన్ నిత్యా ఎలా ఉంటుందో చాలామంది ప్రేక్షకులకు కూడా తెలుసు. తనకు నచ్చని విషయాన్ని నచ్చింది అని చెప్పడం గానీ, నచ్చింది అన్నట్టుగా ప్రవర్తించడం గానీ తను చేయదు. నిత్యా మీనన్‌ది ముక్కుసూటి తత్వం అని తన కో స్టార్లు కూడా చెప్తుంటారు. అలా తన నేచురల్ నేచర్‌తోనే చాలామంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కాదలిక్క నేరమిల్లై’ ఆడియో లాంచ్‌లో మాత్రం ఈవెంట్స్ ఆర్గనైజర్‌తో నిత్యా ప్రవర్తన చాలామంది నచ్చలేదు.
Also Read: బాలయ్య చేసిన పనికి రేణూ దేశాయ్ షాక్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను..!
వారితోనే ఎందుకలా.?
‘కాదలిక్క నేరమిల్లై’ (Kadhalikka Neramillai) మూవీ ఆడియో లాంచ్‌కు దర్శకుడు మిస్కిన్, హీరో జయం రవితో పాటు నిత్యా మీనన్ కూడా హాజరయ్యింది. తను మాట్లాడడానికి స్టేజ్‌పైకి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్‌ను నవ్వుతూ పలకరించింది. కానీ తను హ్యాండ్ షేక్ కోసం చేయి ఇవ్వగానే తనకు ఆరోగ్యం బాలేదంటూ, అందుకే హ్యాండ్ షేక్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చింది. నిత్యా మీనన్ అలా అనుకోవడం కరెక్టే కదా ఇందులో తప్పేం ఉంది అనుకోవచ్చు. కానీ స్టేజ్ ఎక్కే ముందు హీరో అయిన జయం రవికి, దర్శకుడు మిస్కిన్‌కు హగ్ ఇచ్చి మరీ వెళ్లింది నిత్యా. అంటే వారికి వైరల్ ఫీవర్ లాంటివి ఏమీ రావా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
తమిళంలో బిజీ
నిత్యా మీనన్‌పై ఇలాంటి విమర్శలు రావడం ఇదేమీ కొత్త కాదు. అయినా కూడా తనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక వ్యక్తిలో కంటెంట్ ఉన్నప్పుడు ఆ మాత్రం పొగరు ఉండడం కూడా సహజమే అంటూ తన ఫ్యాన్స్ తనకే సపోర్ట్‌గా నిలబడతారు. ప్రస్తుతం తెలుగులో తనకు అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులతో దూసుకుపోతోంది నిత్యా. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఇడ్లీ కడాయ్’ అనే మూవీలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
Ena behaviour Idhu #NithyaMenen 😐
— Itz_Prasanna (@prasanna_dbc) January 9, 2025