E-Paper
Advertisement

The Raja Saab OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ది రాజా సాబ్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

The Raja Saab OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ది రాజా సాబ్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Advertisement

The Raja Saab OTT: ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా గత ఏడాది డిసెంబర్లో విడుదలైన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతు ఇక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి.. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ప్రభాస్ (Prabhas)నటించిన ది రాజా సాబ్ (The Raja Saab)కూడా ఒకటి.

ఓటీటీలోకి రాజా సాబ్..

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా హర్రర్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినప్పటికీ కనీసం సగం కూడా కలెక్షన్లను రాబట్టలేక భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి ప్రేక్షకులను పూర్తిగా నిరాశకు గురి చేయడంతో ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ మారుతి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా థియేటర్లో ప్రేక్షకులను నిరాశపరిచిన రాజా సాబ్ త్వరలోనే ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జియో హాట్ స్టార్ సుమారు 80 కోట్లకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయని చెప్పాలి. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని నేపథ్యంలో త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది.

మహాశివరాత్రి సందర్భంగా..

Advertisement

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ఫిబ్రవరి 6 తేదీ లేదా 13వ తేదీ లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా తిరిగి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని థియేటర్లో చూడటం మిస్సయిన వారు ఎంచక్కా జియో హాట్ స్టార్(Jio Hot Star) లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి థియేటర్లలో పెద్దగా ప్రేక్షకు ఆధరణ సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా డిజిటల్ మీడియాలోనైనా ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది అతి త్వరలోనే జియో హాట్ స్టార్ ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ వింటే లుక్ లో కనిపించినప్పటికీ కథపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ కు జోడిగా ఈ సినిమాలో రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Sita Ramam 2: సీతారామం 2 రాబోతోందా? సీక్వెల్ పై అంచనాలు పెంచిన ఫోటో!

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×