E-Paper
Advertisement

Sampath Kumar: నాపై అసత్య ప్రచారమా? కేటీఆర్, హరీష్ రావులపై సంపత్ కుమార్ ఫైర్

Sampath Kumar: నాపై అసత్య ప్రచారమా? కేటీఆర్, హరీష్ రావులపై సంపత్ కుమార్ ఫైర్
Advertisement

Sampath Kumar: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను నిరసిస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్ల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను ఆసరాగా చేసుకొని, బీఆర్ఎస్ నేతలు తనపై , ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జేసీబీ యజమానికి రావాల్సిన డబ్బుల విషయంలో జరిగిన చిన్న వివాదాన్ని బీఆర్ఎస్ పార్టీ తన సొంత పత్రిక వేదికగా వక్రీకరించిందని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్ వంటి నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్కడా లేదని.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు తెరలేపారని స్పష్టం చేశారు.

Advertisement

బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తన గౌరవానికి భంగం కలిగించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంపత్ కుమార్ హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు, క్రిశాంక్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సదరు నాయకులను , వారి సోషల్ మీడియా విభాగాన్ని కోర్టుకు ఈడుస్తానని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా చట్టపరంగా బుద్ధి చెప్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: పైలట్ల తప్పిదమా? సాంకేతిక లోపమా.. ప్రమాదానికి ముందు ఏమైంది?

Advertisement

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×