BigTV English

OTT Movie : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువే. ఈ సినిమాలలో హాట్ సీన్స్ కూడా ఉండటమే అందుకు కారణం. ఇలాంటి కంటెంట్ హాలీవుడ్ సినిమాలలో మామూలే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఈ సీన్స్ కొంచెం హద్దులు దాటుతాయి. ఇందులో యాభై ఏళ్ళ మహిళతో, 33 ఏళ్ళ యువకుడు సంబంధం పెట్టుకుంటాడు. ఆతరువాత స్టోరీ రచ్చ రచ్చే. ఈ ఎరోటిక్ థ్రిల్లర్‌ సినిమాని మీరు కూడా చూడాలనుకుంటే, రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. ఇది ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? దీని పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

దాదాపు 50 ఏళ్ల వయస్సులో ఉన్న సోఫీ, ఒక ధైర్యమైన ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఒక పార్టీలో వయసులో ఉన్న ఎలియట్ అనే క్యాటరింగ్ వెయిటర్‌ను కలుస్తుంది. ఇక వెంటనే మొదటి రాత్రి ఒక ఉద్వేగభరితమైన ఎన్‌కౌంటర్‌గా మారుతుంది. సోఫీ, తన లైఫ్ స్టైల్ ని ఆనందిస్తూ, ఎలియట్‌ను తన రెండవ డేట్‌కు పారిస్‌లోని ఒక విలాసవంతమైన టూర్ కి తీసుకెళ్తుంది. ఈ సంబంధం సోఫీకి ఒక సాధారణ ఫ్లింగ్ మాత్రమే. కానీ 33 ఏళ్ల వయస్సులో ఉన్న ఎలియట్, ఈ సంబంధాన్ని చాలా సీరియస్ గా భావిస్తాడు. సోఫీ తమ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించినప్పుడు, ఎలియట్ నిరాశ, అబ్సెషన్ ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. అతను ఆమెను స్టాక్ చేయడం ప్రారంభిస్తాడు. ఆమె ఇంటి వద్ద, ఆఫీస్ లో బెదిరింపులకు పాల్పడతాడు.


ఈ చిత్రం రెండవ భాగంలో స్టోరీ సోఫీ వైపు టర్న్ అవుతుంది. ఆమె ఎలియట్ స్టాకింగ్‌తో వచ్చే భయాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఎలియట్ పనిచేసేచోట, వీళ్ళిద్దరూ సన్నిహితంగా గడిపిన వీడియోలను పంపుతాడు. ఆమె జీవితంలో ఇప్పుడు ఒక స్కాండల్‌ లో ఇరుక్కునే ప్రమాదంలో పడుతుంది. సోఫీ ఒక శిక్షణ పొందిన బాక్సర్‌గా, తన భయాన్ని కోపంగా మార్చి, ఎలియట్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుంది. రక్తం తెప్పిస్తూ అతనిని కొడుతుంది. ఈ కాథర్టిక్ చర్య సోఫీకి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఎలియట్, ఆమె దాడిని ప్రేమతో కొట్టినట్లు తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. ఎలియట్ నుంచి సోఫీ బయటపడుతుందా ? అతని సైకిక్ చర్యలు ఆమెను ఎలా ఇబ్బంది పెడతాయి ? అతనితోనే సర్దుకుపోతుందా ? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

లయన్స్‌గేట్ ప్లేలో 

‘ప్రెట్టీ థింగ్’ (Pretty Thing), 2025లో విడుదలైన అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం. జస్టిన్ కెల్లీ దర్శకత్వంలో రూపొందింది. 2025 జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఆగష్టు 8 నుండి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో అలీసియా సిల్వర్‌స్టోన్ (సోఫీ), కార్ల్ గ్లస్‌మన్ (ఎలియట్), కాథరిన్ కర్టిన్ (పెగ్గీ), టామీ బ్లాంచర్డ్ (అమండా), ప్రధాన పాత్రల్లో నటించారు. సిల్వర్‌స్టోన్ నటనకు ప్రశంసలు వచ్చాయి.

Read Also : రిక్షా డ్రైవర్ తో ఇదేం పాడు పనిరా అయ్యా… ప్రొఫెసర్ ప్రైవేట్ వీడియో లీక్ తో అడ్డంగా బుక్… మోస్ట్ కాంట్రవర్సీ మూవీ

Related News

Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

OTT Movie : చావు ఇంట్లో చక్కిలిగింతలు… 16 గంటల్లో సాగే స్టోరీ… ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ కామెడీ డ్రామా

OTT Movie : రాత్రికి మాత్రమే వచ్చిపోయే చందమామ… పెళ్లి వద్దు అదే ముద్దు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Darshana Rajendran: రియల్ స్టోరీతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Big Stories

×