OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ స్టోరీలతో వస్తుంటే, మరికొన్ని ట్రాజిడీ స్టోరీలతో ముగుస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందింది. ఇది ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవితంలో జరిగిన సంఘటనలు చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ జీవించాడనే చెప్పాలి. ఈ చిత్రం 2015లో బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రీమియర్ అయింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘అలీగఢ్’ (Aligarh) హన్సల్ మెహతా దర్శకత్వంలో విడుదలైన హిందీ డ్రామా చిత్రం. ఇషానీ బెనర్జీ, అపూర్వ అస్రానీ రాసిన కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ పాత్రలో, రాజ్‌కుమార్ రావు దీపు సెబాస్టియన్ పాత్రలో, అశిష్ శర్మ, బలరామ్ పండే, ఇషానీ బెనర్జీ వంటి నటులు సహాయక పాత్రలలో నటించారు. 2016 ఫిబ్రవరి 26న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 లలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో మరాఠీ సాహిత్య ప్రొఫెసర్. 2010లో 64 ఏళ్ల సిరాస్ తన క్యాంపస్ క్వార్టర్స్‌లో ఒక రిక్షా డ్రైవర్‌తో సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు, కొంతమంది రహస్యంగా వీడియో తీసి వైరల్ చేస్తారు. ఈ ఘటనను విశ్వవిద్యాలయ అధికారులు “అనైతిక ప్రవర్తన”గా భావించి, సిరాస్‌ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తారు. దీని వల్ల అతను చాలా అవమానాలు పడతాడు. ఈ సంఘటనతో సిరాస్ జీవితం తలకిందులవుతుంది. అతను ఒంటరిగా ఉంటూ సమాజంతో పోరాడతాడు. సిరాస్ కథను కవర్ చేయడానికి, దీపు సెబాస్టియన్ అనే ఒక జర్నలిస్ట్ అలీగఢ్‌కు వస్తాడు. దీపు, సిరాస్‌ని ఇంటర్వ్యూ చేస్తూ అతని బాధను అర్థం చేసుకుంటాడు.
సిరాస్ ఒక స్వలింగ సంపర్కుడిగా, సమాజం నుండి ఎదుర్కొన్న అవమానం, వివక్షను దీపుతో పంచుకుంటాడు. అతను తన ఉద్యోగాన్ని తిరిగి పొందడానికి చట్టపరమైన పోరాటాన్ని ప్రారంభిస్తాడు. దీనికి దీపుతో పాటు, ఒక న్యాయవాది కూడా సహాయం చేస్తారు. ఈ చట్టపరమైన పోరాటం భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 (స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టం) నైతికతను సవాలు చేస్తుంది. ఈ సినిమా సిరాస్ ఒంటరితనం, అతని సున్నితమైన కవిత్వం, సమాజంలో అతని పోరాటాన్ని ఆలోచనాత్మకంగా చూపిస్తుంది. సినిమా చివరలో, సిరాస్ చట్టపరమైన పోరాటం ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. కానీ అతని జీవితం ఒక విషాద ముగింపుకు చేరుకుంటుంది. చట్టపరంగా అతనికి ఎలాంటి తీర్పు వస్తుంది ? అతని జీవితం ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం