E-Paper
Advertisement

Dhandoraa Movie Review : దండోరా రివ్యూ.. మంగపతి రియలైజేషన్

Dhandoraa Movie Review : దండోరా రివ్యూ.. మంగపతి రియలైజేషన్
Advertisement

Dhandoraa Movie Review : మూవీ ప్రమోషన్స్ నుంచే పాడే.. కులం అనే సెన్సిటీవ్ అంశాలను చూపించారు. నిజానికి ఇలాంటి వాటిని సినిమాగా చూపించడానికి కాస్త ధైర్యం కావాలి. కానీ, దండోరా మూవీ యూనిట్.. తమ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అంటూ ప్రమోషన్స్ చేసుకున్నారు. అంతలా బలమైన పాయింట్ ఈ సినిమాలో ఏం ఉంది? ఆ పాయింట్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కులమే పంచ ప్రాణాలు అనే బతికే శివాజీ (శివాజీ) గుండెపోటుతో చనిపోతాడు. బతికి ఉన్నన్ని రోజులు కులమే గొప్ప అని బతికే శివాజీ అంతిమ సంస్కారాలు చేయడానికి తన కులమే అడ్డుగా మారుతుంది. సిటీలో ఉండే కొడుకు విష్ణు (నందు) తండ్రి చనిపోయినా.. పెద్దగా ఫీల్ అవ్వడు. కూతురు సుజాత (మణిక) ఎప్పుడో చనిపోతుంది. కొడుకు పట్టించుకోకపోవడం.. కూతురు చిన్నతనంలో చనిపోవడానికి శివాజీ ఎలా కారణం అయ్యాడు? కులం కోసమే బతికే శివాజీకి కులమే శత్రువుగా ఎలా మారింది? వీటి అన్నింటికీ పరువు హత్యలకు సంబంధమేంటి? అనేది మిగితా స్టోరీ.

విశ్లేషణ:

Advertisement

కూలంతర ప్రేమలు.. వివాహాలు.. తర్వాత పరువు హత్యలు. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఇక్కడ దండోరా సినిమాను కూడా అలాంటి కాన్సెప్ట్ తోని రూపొందించారు. అయితే కాస్త బలగం టచ్ ఇస్తూ.. ఓ వర్గం ఆడియన్స్, పల్లెటూరు ప్రజలను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అలాంటి ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు. అయితే ఇంకాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. సూపర్ సక్సెస్ అనే పదాలు వచ్చేవి కావొచ్చు.

నిజానికి ఇలాంటి కథల్లో బాధితుడు అనే వాడు తక్కువ కులం వాడు అని చూపిస్తారు. కానీ, ఇక్కడ డైరెక్టర్ కాస్త స్టెప్ తీసుకుని ఎక్కువ కులం వాడు కూడా బాధితుడే అని చెప్పే ప్రయత్నం చేశాడు. అదే సినిమాకు, కథకు కొత్త అని చెప్పొచ్చు. సెన్సార్ వల్ల సినిమాలో కొన్ని కట్స్ ఇచ్చారు. అవి కూడా యాడ్ అయితే.. సినిమాకు మరింత ప్లస్ అయ్యేదేమో.

Advertisement

ఇలా ఎమోషనల్ ఆలోచిస్తే బానే ఉన్నా… సినిమాను ఆడియన్స్ మెచ్చెలా తియ్యాలి. అప్పుడే అది సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది. అలా దండోరాను తెరకెక్కించడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. సినిమా స్టార్టింగ్ అందరినీ టచ్ చేసేలా చేశాడు. కానీ, దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. పాత్రలను పరిచయం చేసిన తర్వాత… ఎందుకో ల్యాగ్ అనే ఫీల్ వస్తుంది. ఆ ఎపిసోడ్ త్వగానే క్లోజ్ చేయొచ్చు అయినా.. పొడిగించాడు అనేలా ఉంటాయి కొన్ని. అలాగే తెలంగాణ ఏరియాలో కథ చెబుతున్నాడు కాబట్టి.. ఆ స్లాంగ్ విషయంలో డైరెక్టర్ మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది.

మళ్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒకే. అక్కడి నుంచి అయినా.. సినిమాను కాస్త పరుగులు పెట్టిస్తే బాగుండు అనిపిస్తుంది. అక్కడ వచ్చే శివాజీ లవ్ స్టోరీ.. అది రియలైజేషన్ కోసమే అని అర్థమవుతున్నా… ఆ రియలైజేషన్ కి కాస్త ఎక్కువే టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది.

ఇక.. శివాజీ కోర్టు సీన్మ తో మళ్లీ సినిమాకు వైభవం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్.. క్లైమాక్స్ అన్నీ కూడా ఆడియన్ ను ఓ వైబ్ కి తీసుకెళ్తాయి. సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ తో ఓ పాజిటివ్ వైబ్ తో ఆడియన్స్ బయటికి వస్తారు. కానీ, ఆ క్లైమాక్స్ సీన్ ను పూర్తిగా చూపిస్తే ఇంకా బాగుండేది.  అలాగే, చావు దగ్గర తెలంగాణ పల్లెటూరుల్లో కనిపించే హడావుడిని… ఆ మాటలను డైరెక్టర్ సరిగ్గా క్యాప్చర్ చేశాడు. అవి కాస్త నవ్వు తెప్పిస్తాయి సినిమాలో. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ చేశాడు డైరెక్టర్.

ఇక సినిమాలో నటీనటులు అంటే.. శివాజీ బాగా చేశాడు. ఆయన గతంలో చేసిన మంగపతి క్యారెక్టర్ కి ఇక్కడ పార్ట్ 2 కనిపిస్తుంది. సర్పంచ్ పాత్రలో కనిపించిన నవదీప్ కూడా అద్భుతంగా నటించాడు. నందుతో పాటు మిగితా వాళ్లు కూడా ఆయా పాత్రలకు సరిగ్గా సెట్ అయ్యారు. టిక్నికల్ గా అంటే… ఎడిటింగ్ కు కాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో. మ్యూజిక్ పర్లేదు. కెమెరా వర్క్ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ
నటీనటుల ఫర్ఫామెన్స్
ఇంటర్వెల్ & క్లైమాక్స్
మెసెజ్

మైనస్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్ సెకండాఫ్ లో కొంత వరకు

మొత్తంగా… మంగపతి మారిపోతే ఇలా ఉంటుందేమో…

Dhandoraa Movie Rating : 2.75 / 5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×