E-Paper
Advertisement

Action Thriller on OTT : ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని ఉపేంద్ర యాక్షన్ థ్రిల్లర్… చేతులెత్తేసిన మేకర్స్

Action Thriller on OTT : ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని ఉపేంద్ర యాక్షన్ థ్రిల్లర్… చేతులెత్తేసిన మేకర్స్
Advertisement

Action Thriller on OTT : కొన్ని సినిమాలకు ఓటీటీలో అడుగు పెట్టే అదృష్టమే ఉండదు. చాలా వరకు మూవీస్ థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల్లోనే ఓటీటీలలోకి వస్తాయి. కానీ మరికొన్ని మాత్రమే థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నా, ఓటీటీ రిలీజ్ కు మాత్రం నోచుకోవు. ఆ లిస్ట్ గత ఏడాది విడుదలైన ఉపేంద్ర హిట్ మూవీ కూడా చేరింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ఒక సంవత్సరం పూర్తయినా, ఇంకా ఓటీటీలోకి రాలేదు. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఉపేంద్ర సినిమాకు ఓటీటీ కష్టాలు

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇటీవలే తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో కనిపించాడు. అంతకు ముందు ఆయన సైకలాజికల్ – సోషల్ – పొలిటికల్ థ్రిల్లర్ అయిన UI అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు. ఉపేంద్ర దర్శకుడిగా, హీరోగా చేసిన ‘యుఐ’ మూవీ థియేటర్లలో విడుదలై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఉపేంద్ర సోషల్ మీడియాలో ఈ మైలురాయిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాకపోవడం అన్నది ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. ఏడాది గడిచినా ఈ సినిమా ఇంకా డిజిటల్ విడుదలకు నోచుకోలేదు. అయితే మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి ఉపేంద్ర లేదా లేదా నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ZEE5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు విన్పించినప్పటికీ, విడుదల తేదీకి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఉపేంద్ర ట్రిపుల్ రోల్ (సత్య, కల్కి, ఉపేంద్ర రావు) పోషించారు. రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, సద్ధు కోకిల ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

Read Also :  భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ప్రయాణం… అర్దరాత్రి ఒంటరిగా డ్రైవర్ చేతికి చిక్కడంతో ట్విస్ట్… మస్ట్ వాచ్

స్టోరీలోకి వెళ్తే…

ఫిల్మ్ క్రిటిక్ కిరణ్ ఆదర్శ్ (ఉపేంద్ర) చదివే స్క్రిప్ట్ తో మూవీ మొదలవుతుంది. ఈ స్క్రిప్ట్ ఒక ఫాంటసీ డిస్టోపియన్ వరల్డ్‌లో సాగుతుంది. ఒక మహిళను (మదర్ ఎర్త్ సింబల్) అనామకులైన క్రిమినల్స్ బలవంతం, టార్చర్ చేస్తారు. దీంతో ఆమె గర్భవతి అవుతుంది. ఒక జ్యోతిష్కుడు వీర బ్రహ్మేంద్ర గురు ఆమె బిడ్డ మధ్యరాత్రి జన్మిస్తే కల్కి (విష్ణు 10వ అవతారం) అవుతాడని, కలియుగాన్ని ముగించి సత్యయుగాన్ని తెస్తాడని ప్రవచిస్తాడు. కానీ ఆమె ట్విన్స్‌కు జన్మనిస్తుంది. సత్య, కల్కి కొన్ని నిమిషాల వ్యవధిలో మధ్యరాత్రి జన్మిస్తారు.

Advertisement

సత్య ఒక సొసైటీలో అవినీతి, క్రైమ్, వివక్ష, ధనిక-పేద వ్యత్యాసాలు, కుల మత హత్యలు, మీడియా ఫేక్ న్యూస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి సోషల్ వర్క్ చేస్తాడు. కానీ సొసైటీలో అవినీతి పెరిగి, పాలకులు ప్రజలను ప్రశ్నించకుండా మానిప్యులేట్ చేస్తారు. మరోవైపు కల్కి మనుషులను ద్వేషిస్తాడు. అతను మనస్తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుని, మనుషులను సెల్ఫ్-డిస్ట్రక్ట్ చేసుకునేలా బ్రెయిన్‌వాష్ చేస్తాడు. ఈ క్రమంలోనే కల్కి సత్యను మైండ్ మేజ్‌లో బంధిస్తాడు. ఒకవేళ అతను దాని నుంచి ఎస్కేప్ అయితే వదిలేస్తా అని చెబుతాడు. సత్య ఎస్కేప్ చేస్తాడు.

కానీ కల్కి సత్య ఫాలోవర్స్‌ను మానిప్యులేట్ చేసి, వారిని సత్యపైకి పంపి చంపేస్తాడు. కల్కి అన్‌క్రౌన్డ్ ఎంపరర్‌గా మారి సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి, మతం, కులం పేరుతో ఘర్షణలు సృష్టిస్తాడు. మొబైల్ ఫోన్స్‌ను రేషన్‌లా డిస్ట్రిబ్యూట్ చేసి, కంటెంట్ క్యూరేట్ చేసి సొసైటీని స్వయం శత్రువుగా మారుస్తాడు. కులాలను నంబర్డ్ హైరార్కీగా డివైడ్ చేసి, అప్పర్ కులాలకు ప్రయారిటీ ఇస్తాడు. లోయర్ కులాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి సర్వైవ్ చేస్తాయి. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది స్టోరీ. ఉపేంద్ర ఫ్యాన్స్, సై-ఫై, థాట్-ప్రొవోకింగ్ సినిమాలు ఇష్టపడే వారు మస్ట్ వాచ్. కాకపోతే బ్రెయిన్ యూజ్ చేసి చూడాలి.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×