E-Paper
Advertisement

Psych siddartha OTT: ఆ ఓటీటీకే సైక్ సిద్ధార్థ డిజిటల్ రైట్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Psych siddartha OTT: ఆ ఓటీటీకే సైక్ సిద్ధార్థ డిజిటల్ రైట్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Psych siddartha OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదల అయింది అంటే కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే తిరిగి ఆ సినిమా ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదలైన సినిమాలన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. జనవరి ఒకటవ తేదీని పురస్కరించుకొని మరికొన్ని సినిమాలు కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో శ్రీ నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ (Psych siddartha) సినిమా ఒకటి.

శ్రీ నందు సైక్ సిద్ధార్థ…

శ్రీ నందు(Sree Nandu) ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదివరకు పలు సినిమాలలో నందు కీలకపాత్రలలో నటించి సందడి చేశారు. హీరోగా సవారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈయన విభిన్నమైన కథ నేపథ్యంలో తెరకెక్కిన సైక్ సిద్ధార్థ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఆహా చేతికి సైక్ సిద్ధార్థ రైట్స్..

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ డీల్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగు వారాల థియేటర్ రన్ అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రసారం చేసే విధంగా డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ థియేటర్లో ప్రసారం కాగా జనవరి చివరి వారంలో ఆహాలో ప్రసారం కాబోతోందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన రానుంది.

నిర్మాణంలో భాగస్వామ్యం..

Advertisement

ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ వచ్చేసరికి ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది . ఇక ఈ సినిమా కోసం శ్రీ నందు భారీగానే కష్టపడ్డారని తెలుస్తోంది .రొటీన్ గా కాకుండా సరికొత్త కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాపై నందు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పొందిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ద్వారా నందు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Shanmukh Jaswanth: దీప్తి సునయనకు షాక్ ఇచ్చిన షన్ను.. కొత్త లవర్ ను పరిచయం చేస్తూ ఫోటోలు!

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×