E-Paper
Advertisement

VK Naresh – Pavitra: పుకార్లకు చెక్.. అలా క్లారిటీ ఇచ్చిన నరేష్ – పవిత్ర జంట!

VK Naresh – Pavitra: పుకార్లకు చెక్.. అలా క్లారిటీ ఇచ్చిన నరేష్ – పవిత్ర జంట!
Advertisement

VK Naresh – Pavitra: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా పేరు తెచ్చుకున్న జంటలలో పవిత్ర లోకేష్ (Pavitra Lokesh), వీ.కే.నరేష్ (VK Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి అటు టాలీవుడ్ సీనియర్ నటుడిగా వీకే నరేష్.. విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో రాణిస్తున్నారు. పలు చిత్రాలలో నటిస్తూ మంచి ప్రేక్షకాభిమానం దక్కించుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల పరంగా ఉన్నత స్థాయిలో నిలిచిన ఈయన.. వ్యక్తిగతంగా పలు రకాల విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగి ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన.. మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేసి వార్తల్లో నిలిచారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెతో కలిసి తిరగడమే కాకుండా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.అయితే ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా వీరిద్దరూ ఒకే చోట కలిసి జీవించడం లేదు అనే వార్తలు రాగా తాజాగా ఒక ఫోటోతో రూమర్స్ కి చెక్ పెట్టారు నరేష్.

న్యూ ఇయర్ స్పెషల్ ఫోటో..

తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను తన ప్రియురాలు పవిత్ర లోకేష్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఈ జంటకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు అంటూ వార్తలు రాగా.. ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చింది ఈ జంట. ఇకపోతే గతంలో నరేష్, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ అనే చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రానికి నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, కన్నడ భాషలో విడుదల చేయగా మంచి టాక్ లభించింది. ఇదిలా ఉండగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ చాలా సార్లు జంటగా ఈవెంట్స్ కు హాజరయ్యారు. ఇదిలా ఉండగా మరొకవైపు వీరిద్దరూ కలసి కొత్త ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే.ఈ ఇంటి గృహప్రవేశానికి కూడా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు.

Advertisement

also read:Spirit New Update: సందీప్ రెడ్డి మాస్ ప్లాన్… ఇటు స్పీడు.. అటు దిమ్మతిరిగే అప్డేట్

వీకే నరేష్ కెరియర్..

దివంగత దర్శకురాలు, ప్రముఖ నటి విజయనిర్మల మొదటి భర్త కే.ఎస్.మూర్తి కుమారుడే వీకే నరేష్. 1972లో పండంటి కాపురం అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కవిత , సంతోష సౌభాగ్యం వంటి చిత్రాలలో కూడా బాల నటుడిగా నటించారు. ఇక 17 సంవత్సరాల వయసులో శ్రీ జంధ్యాల దర్శకత్వం వహించి, నవత కృష్ణంరాజు నిర్మించిన నాలుగు స్తంభాలాట సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వం వహించిన ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కూడా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి ఇమేజ్ ను అందించి పెట్టాయి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×