E-Paper
Advertisement

Psycho Thriller OTT : అబ్బాయిల్ని మోసం చేసిన చేసిన అమ్మాయిల్ని చంపే సైకో… ప్రభుదేవాను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు భయ్యా

Psycho Thriller OTT : అబ్బాయిల్ని మోసం చేసిన చేసిన అమ్మాయిల్ని చంపే సైకో… ప్రభుదేవాను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు భయ్యా
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కిస్తుంటాయి. పైగా ఆ కిల్లర్ పోలీసులను పరిగెత్తించే తీరు, మనుషులను అమానుషంగా చంపి ఎస్కేప్ అయ్యే తీరు ఆకట్టుకుంటుంది. గుండె గుభేల్మన్పించే ఇలాంటి కథల్లోనూ కొత్త కొత్తగా ఎన్నో స్టోరీలు వస్తున్నాయి. సైకో థ్రిల్లర్ సినిమాల్లో అమ్మాయిలను టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు మేకర్స్. అలాంటి సినిమాలు ఇదివరకు హాలీవుడ్ లోనే వచ్చాయి. కానీ ఇప్పుడు సౌత్ లో, తెలుగులోనూ ఎన్నో కథలు వచ్చాయి. వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీని ఈరోజు మూవీ సజెషన్ లో మీ ముందుకు తీసుకొచ్చాము. మరి ఆ మూవీ ఏంటి? స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన తమిళ్ సైకలాజికల్ రొమాంటిక్ త్రిల్లర్ ‘Bagheera (2023)’. ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ మహిళలను టార్గెట్ చేసి చంపే కథ ఇది. ఇందులో ప్రభుదేవా, శ్రీకాంత్, అమైరా దస్తూర్, సోయా అగర్వాల్, సాక్షి అగర్వాల్, యశికా ఆనంద్, రమ్య నాంబేశన్, సంచిత శెట్టి, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. గణేశన్ శేఖర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ 2023 మార్చి 3న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. ప్రభుదేవాను ఇలాంటి రోల్ లో అస్సలు ఇప్పటిదాకా చూసి ఉండరు. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మారిన ఈ ఫిల్మ్ స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : హాలీవుడ్ నుంచి మరాఠీ వరకు… జియో హాట్ స్టార్ అప్ కమింగ్ సినిమాలు, సిరీసులు

స్టోరీలోకి వెళ్తే…

మురళిధరన్ (ప్రభుదేవా) అనే సైకోపాత్ కు మహిళలంటే చంపి పడేసేంత ద్వేషం ఉంటుంది. గతంలో అతని జీవితంలో జరిగిన కొన్ని బాధకరమైన సంఘటనలే అందుకు కారణం. తల్లి మరణం, స్నేహితురాలి మోసం వంటి సంఘటనలు, మహిళల పట్ల అతనికి ఉన్న ద్వేషం సీరియల్ కిల్లర్‌గా మారుస్తుంది. మురళిధరన్ “బఘీరా” అనే పేరుతో మహిళలను టార్గెట్ చేసి చంపుతాడు. అబ్బాయిలను మోసం చేస్తే చాలు బఘీరా వచ్చి రివెంజ్ తీర్చుకుంటాడు. ముందుగా మహిళలను అట్రాక్ట్ చేసి, ప్రేమలో పడేలా చేస్తాడు. వాళ్ళు మోసం చేసినట్టు నిరూపించి చంపేస్తాడు. ఆ మరణాలను యాక్సిడెంట్‌లుగా చిత్రీకరించి, బాడీస్‌ను స్టాచ్యూస్‌గా మార్చి దాచేస్తాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఒక యువకుడు (శ్రీకాంత్) సూసైడ్ ప్రయత్నం చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసంతో ప్రాణం తీసుకోబోయిన అతనికి ఓ స్నేహితుడు “బఘీరా” యాప్ ద్వారా రిలీఫ్ పొందవచ్చు అని చెప్తాడు. ఆ యాప్‌లో మహిళలు మోసం చేస్తే కంప్లైంట్ చేయవచ్చు, బఘీరా వచ్చి చంపేస్తాడు అని తెలుసుకున్న యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ రమ్య పై కంప్లైంట్ చేస్తాడు. బఘీరా రమ్యను టార్గెట్ చేసి, ఆమెను ప్రేమలో పడేలా చేసి, ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అతను ఇంతకు ముందు చంపిన మహిళల స్టాచ్యూస్ కూడా ఉంటాయి. అక్కడే రమ్యను బంధించి, బఘీరా ఆమెను టార్చర్ చేస్తాడు. మరోవైపు పోలీస్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్ (గోపీనాథ్ రవి) బఘీరా మర్డర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. రమ్య సైకాలజీ స్టూడెంట్ గా బఘీరా కేస్ స్టడీ చేస్తుంది. ఆమె ఇప్పుడు స్వయంగా అతని ట్రాప్ లో చిక్కుకుంటుంది. మరి ఆ అమ్మాయి ఈ సైకో నుంచి ఎలా బయట పడింది? పోలీసులు బఘీరాను పట్టుకున్నారా? రమ్య బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన సీక్రెట్ ఏంటి? అన్నది స్టోరీ.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×